ఫస్ట్ టైం అలాంటి పాత్రలో సాయిపల్లవి…క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ హైప్స్..?

సాయి పల్లవి..ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒక్కే ఒక్క సినిమాతో తన టాలెంట్ ను బయటపెట్టి..క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తూ..వచ్చిన అవకాశాలల్లో..నచ్చిన సినిమాలు చేస్తూ..ఇష్టం లేని గ్లామరస్ రోల్స్ కి దూరంగా..నచ్చిన డ్యాన్స్ కు దగ్గరగా..ఉండే పాత్రలు చూస్ చేసుకుంటూ..అభిమానులను మెప్పిస్తుంది. సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి లాంటి హీరోయిన్ ఇంతకముందు లేరు..ఇక పై రారు అంటుంటారు ఆమె అభిమానులు. ఆ మాటల్లో నిజం లేకపోనూలేదు.

ఎందుకంటే నేటి తరం హీరోయిన్లు చాలా మంది డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తూ..అడ్డ దిడ్డమైన రోల్స్ చేస్తూ.. బికినీలు కూడా వేసుకుని నటించడానికి రెడీ అయిపోయారు. మరికొందరు ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాము అంటే అది కూడా తీసేయ్యడానికి వెనుకాడరు..అంత కమర్షీయల్ మైండ్ తో ఉన్నారు. కానీ సాయి పల్లవి కి డబ్బు మీద ఆశ లేదు..సినిమా ఇండస్ట్రీలో పాతుకు పోవాలనే కోరికాలేదు. నచ్చిన సినిమాలు వస్తే చేస్తా..లేకపోతే సైలెంట్ గా నా పని చేసుకుంటా..అంతేకానీ ఎక్స్ పోజింగ్ మాత్రం చేయను అంటు భీష్మించుకుని కూర్చుంది.

కాగా, ఈ మధ్య కాలంలో సాయి సినిమాలకు సీన్ చేయలేదు. నచ్చిన కధ రాకపోవడంతో చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకుంది. కానీ, రీసెంట్ గా అమ్మడు తన ఫేవరేట్ హీరో కమల్ హాసన్ సినిమాలో నటించబోతుందనే వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవి సైన్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడట. కాగా, ఈ సినిమా లో ఫస్ట్ టైం సాయి పల్లవి పోలీస్ ఆఫిసర్ పాత్రలో కనిపించనుందని టాక్ బయటకు వచ్చింది. కమల్‌హాసన్‌ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ కావడం, ఇందులో సాయిపల్లవి నటించనుండంతో ఇప్పటికే ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Share post:

Popular