బ్రేకింగ్‌: తిరుప‌తిలో న‌య‌న‌తార – విఘ్నేష్ శివ‌న్ పెళ్లి… డేట్ ఫిక్స్‌

సౌత్ ఇండియన్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార నాలుగు ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అవుతున్నా ఆమె క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెద‌ర్లేదు. తాజాగా ఆమె విజ‌య్ సేతుప‌తి హీరోగా.. స‌మంత‌తో క‌లిసి త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ డైరెక్ష‌న్‌లో కేఆర్కే సినిమా చేసింది. ఈ సినిమా అయితే అంచ‌నాలు అందుకోలేదు. ఇక గ‌త మూడేళ్లుగా న‌య‌న‌తార‌, విఘ్నేష్ క‌లిసి ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు.

స‌హ‌జీవ‌నం చేస్తోన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా ? అని అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్ట‌కేల‌కు వీరు త్వ‌ర‌లోనే పెళ్లికి రెడీ అవుతున్నారు. అయితే వీరు ఎప్పుడూ కూడా గుళ్లు గోపురాలు తిరుగుతూనే ఉంటున్నారు. అయితే వీరు త్వ‌ర‌లోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

కోలీవుడ్ మీడియా టాక్ ప్ర‌కారం న‌య‌న్ – విఘ్నేష్‌ వివాహం జూన్ నెల 9వ తారీఖున జరగబోతోందట. అది కూడా తిరుమల తిరుపతి సన్నిధానంలో వీరు తమ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా వీరి పెళ్లిపై మొత్తానికి స‌స్పెన్స్ వీడిన‌ట్టే…!

Share post:

Latest