కీర్తి బోల్డ్ ఆన్సర్ ..ఆడియన్స్ క్లాప్స్.. మహేష్ బాబు షాక్..!!

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒక్కటే మాట సర్కారు వారి పాట. పరశూరామ్ డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరో గా నటించిన ఈ చిత్రం మే 12న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కీర్తి-మహేశ్ లవ్ ట్రాక్ హైలెట్ గా నిలిచింది. కీర్తి అల్లరి..మహేశ్ అమాయకత్వం..తెర పై ఫుల్ కామెడీ పండించింది. దీంతో వీళ్ల జంట హిట్ పెయిర్ గా నిలిచింది.

కాగా, ఈ సినిమా సక్సెస్ అయిన సంధర్భంగా డైరెక్టర్ ఓ స్పెషల్ చిట్ చాట్ జరిపించారు. ఈ ప్రోగ్రామ్ లో కొత్తగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన సెలెబ్స్, కొందరు ప్రముఖ యూట్యూబర్స్ తో సమావేశమయ్యారు సర్కారు వారి పాట టీం. అందరు చాలా ఫన్నీగా సంతోషంగా సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే సినిమాలో వాళ్లకు ఉన్న డౌట్లు..నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారు..వాళ్ళకు ఎదురైన సంధర్భాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రోగ్రామ్ అంతా చాలా సూపర్బ్ గా నడిచింది.

ఈ క్రమంలోనే..ఓ యూట్యూబర్ కీర్తి సురేశ్ ని ప్రశ్నిస్తూ ..”మేడమ్ , ఈ సినిమాలో మీరు మహేశ్ బాబు పర్స్ దొంగలిస్తారు కదా..అలా మీరు నిజ జీవితంలో ఎప్పుడైన చేశారా”..అంటూ సరదాగా అడిగేశారు. దీనికి మహెశ్ కలగజేసుకుంటూ..” ఏవయ్య,,నిజ జీవితంలో ఎందుకు కొట్టెస్తారు పర్సు..ఏం ప్రశ్న ఇది “,..అంటూ సరదాగా అడుగుతుండగా..కీర్తి ఎంటర్ అయ్యి..”నో నో ..నేను పర్సు కొట్టేశా..”అంటూ అందరికి షాక్ ఇచ్చింది. మహేశ్ బాబు కూడా షాకింగ్ ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చారు. కీర్తి మాట్లాడుతూ..” నేను మా డాడీ పర్సు కొట్టెసేదాని..ఇప్పటికి నాకు ఆ అలవాటు ఉంది”అంటూ చెప్పగానే ..మహేశ్ నవ్వేస్తారు. దీంతో కాసేపు అక్కడ నవ్వులే నవ్వులు. అంతేకాదు సినిమాకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నారు మహేశ్, కీర్తి, పరశూరామ్.

Share post:

Popular