ఆ హీరోయిన్లంతా జిరాఫీలు..హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

ఏంటి..హీరోయిన్లు జిరాఫీలు నా..ఏమిటి ఈ పోలిక..అనుకుంటున్నారా..అయితే, మీరు ఇప్పుడు సమంత పాటను గుర్తు చేసుకోవాల్సిందే. సమంత తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ ఐటెం సాంగ్ చేసిన పాట” ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావా”..ఈ పాటలోని లిరిక్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి..మగాళ్ళను తక్కువ చేస్తున్నట్లు ఉన్నాయని..మగాళ్ల ఈగోని హర్ట్ చేసే విధంగా ఉన్నాయంటూ పెద్ద రచ్చనే చేశారు కొందరు మగాళ్ళు. అంతేనా సినిమా లో పాట ను బ్యాన్ చేయాలని నానా హంగామా చేసారు. కాని సుకుమార్..తన పని తాను చేసుకు పోయాడు.

ఈ పాటలు..” తెలుపు-నలుపు కాదు మీ రంగుతో పని ఏముంది, సన్నసన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటారూ..బొదు బొద్దుగుంటే ఒకరు ముద్దుగున్నావ్ అంటాడు”..అంటూ చాలా అధ్బుతంగా రాశారు చంద్రబోస్. సరిగ్గా అదే పాయింట్ ని యూస్ చేసుకుంటూ బ్యూటీఫుల్‌ హీరోయిన్ అదితి రావ్‌ హైదరీ సంచలన కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మకమైన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2022లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఆమె మిగతా తన తోటీ హీరోయిన్స్ పై కాంట్రవషీయల్ కామెంట్స్ చేసింది. పరోక్షంగా వాళ్ళను జిరాఫీలు తో పోలుస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఐదో రోజు రెడ్‌ కార్పెట్‌పై రెడ్‌ అండ్‌ పింక్‌ గౌన్‌లో అందంగా నడిచి అందరి చూపును తన వైపు తిప్పుకుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ..ఆమె మాట్లాడుతూ..పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి రావ్‌ హైదరీ. “నేను పోట్టిగా ఉంటాను..ఆ విషయం నాకు తెలుసు. కానీ, అందంగా ఉంట. నేను ఎలా ఉన్నానో దానితోనే నాకు హ్యాపీ. నా హైట్ తో నేను చాలా కంఫర్టబుల్ గా ఉంటాను. అందులో నాకు ఏం ఇబ్బంది లేదు. కానీ, నా హైట్ కారణంగా నేను ఇక్కడ ఉన్న జిరాఫీలు…(హైట్ గా ఉన్న మిగతా హీరోయిన్లు)తో పోటీ పడలేను”అంటూ సంచలన కామెంట్స్ చేసింది. కాగా, తన అధ్బుతమైన నటనతో అందంతో..తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీఫుల్‌ హీరోయిన్ అదితి రావ్‌ హైదరీ.

Share post:

Popular