ఈ మెగా గాయం ఎప్పటికి మానదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి..ఎవ్వరి హెల్ప్ లేకుండా..కేవలం కష్టం తోనే.. తన టాలెంట్ ను నమ్ముకుని.. ఒక్కో ఒక్కో సినిమాతో పై పైకి ఎక్కుతూ..ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ గా స్ధిరపడ్డారు కొణిదెల శివ శంకర వర ప్రసాద్. అలియాస్ మెగాస్టార్ చిరంజీవి.

అబ్బో అప్పట్లో మెగాస్టార్ సినిమా లు రిలీజ్ అవుతున్నాయి అంటే ఓ పండగ వస్తుందని అనుకునేవారు. సినిమాలు కూడా ఆ రేంజ్ లోనే ఎంటర్ టైన్ చేశేవి జనాలను. రాను రాను సినిమాలకి బడ్జెట్ లు పెంచుకుంటూ పోతూ.. కధ ను తగ్గించేస్తున్నారు డైరెక్టర్లు. రీసెంట్ గా మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా కు ఎలాంటి టాక్ వచ్చిందో మనకు తెలిసిందే. కెరీర్ లోనే ఘోరాతిఘోరమైన ఫ్లాప్ ను అందుకున్నాదు చిరంజీవి.

ఈ సినిమా చూసిన జనాలు కూడా ఆయన ఎలా ఈ స్టోరీ లేని..కధను ఒప్పుకున్నాడా అంటూ..అడుగుతున్నారు. అంత ఎక్స్ పీరియన్స్ ఉన్న నటుడు ఆ మాత్రం కధ లైన్ బట్టి సినిమా కి మనం సెట్ అవుతామా లేదా అని అంచనా వేయలేదా..? అంటూ కొందరు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా ఆచార్య నిల‌వ‌బోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు 60-70 కోట్ల మ‌ధ్య న‌ష్టం కూడా వచ్చిందంటున్నారు. ఇది ఎవ్వ‌రూ ఊహించ‌ని విష‌యం. ఈ మెగా గాయం ఎప్పటికి మానదు అంటూ..నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం చిరంజీవి తన నెక్స్ట్ సినిమాలకు అయినా..జాగ్రత్త పడుతాడు ఏమో చూడాలి..?

Share post:

Popular