రోజాకు రెడ్డి శాపం.. అందుకే ప‌ద‌వి ద‌క్క‌ట్లేదా…?

వైసీపీ కీల‌క నాయ‌కురాలు… ఫైర్‌బ్రాండ్ రోజా ప‌రిస్థితి ఏంటి? ప్ర‌స్తుతం ఆమె తీవ్ర‌స్థాయిలో అస‌తృప్తితో ర‌గిలిపోతున్నారు. ఇటీవ‌ల కాలంలో క‌నీసం పార్టీ త‌ర‌ఫున వాయిస్ కూడా వినిపించ‌డం లేదు.. నిజానికి టీడీపీ నేత‌ల నుంచి వైసీపీపై ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా..కామెంట్లు వినిపించినా.. వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో రియ‌క్ట్ అయ్యారు. అయిన‌ప్ప‌టికీ.. రోజా ఎక్క‌డా రియాక్ట్ కాలేదు. ఈ నేప‌థ్యంలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని.. అంటున్నారు.

దీనికి కార‌ణం.. ఇప్పుడు జ‌రుగుతున్న మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో అయినా.. త‌న‌కు చోటు ద‌క్కుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. జిల్లాల విభ‌జ‌న‌లో ఆమె నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రి.. తిరుప‌తి జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చింది. అయితే.. ఇదే జిల్లా ప‌రిధిలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కూడా ఉన్నారు. సీనియ‌ర్ కు ఇవ్వాల‌ని అనుకుంటే.. పెద్దిరెడ్డి ని ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. దీంతో జిల్లా న‌నుంచి ఒక్క‌రికి మాత్ర‌మే చోటు ఉంటుంది. దీనిని బ‌ట్టి పెద్దిరెడ్డికే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఒక వేళ పెద్దిరెడ్డిని ప‌క్క‌న పెట్టినా.. రోజాకు అవ‌కాశం ద‌క్క‌డం క‌ష్టంగానే ఉంది. ఎందుకంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి మ‌రింత మంది నేత‌లు నెల్లూరు నుంచి రెడీ గా ఉన్నారు.. ఈ క్ర‌మంలో రెడ్డి అనే ట్యాగే.. రోజాకు శాపంగా మారిందనే చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గంలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. గత మంత్రి వ‌ర్గంలోనూ చోటు కోసం ఎదురు చూసిన .. రోజాకు ఆశ‌లు ఫ‌లించ‌లేదు. ఈ క్ర‌మంలో నే ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ ఇచ్చారు. కానీ, దాన‌ని నుంచి ఆమె త‌ర్వాత‌.. తొల‌గించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏవిధంగా సంతృప్తి క‌లిగిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు రెడ్డి కోటాలో డిప్యూటీ స్పీక‌ర్ అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు. ఒక వేళ ఇది కూడా సాధ్యం కాక‌పోతే.. చీఫ్ విప్ పోస్టును రిజ‌ర్వ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే .. ఈ రెండింటిలో దేనికీ.. రోజా సంసిద్ధంగాలేర‌ని తెలుస్తోంది. త‌న‌కు మంత్రి ప‌ద‌వే కావాలంటూ.. గ‌త కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ త‌ర‌ఫున వాయిస్ కూడా వినిపించ‌డం లేదు. మ‌రి ఆమె అలిగారా? లేక‌.. పిక్చ‌ర్ క‌ళ్ల ముందు క‌నిపిస్తుండ‌డంతో మాన‌సికంగా సిద్ధ‌మ‌వుతున్నారా? అనేది ఆస‌క్తిగా మారింది.