విజ‌య్ ‘బీస్ట్’ రివ్యూ …సినిమా హిట్టా ..పట్టా !

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన తాజా సినిమా బీస్ట్‌. విజ‌య్ మాస్ట‌ర్ త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. న‌య‌న‌తార‌తో కోకిల‌, శివ కార్తీకేయ‌న్‌తో డాక్ట‌ర్ సినిమాలు ఆయ‌న తెర‌కెక్కించ‌డంతో ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. మ‌రి బీస్ట్ తెలుగులో కూడా భారీ అంచ‌నాల‌తోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి బీస్ట్ అంచ‌నాలు అందుకుందో లేదో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ :
ఓ షాపింగ్ మాల్‌లో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ఆ మాల్‌ను ఉగ్ర‌వాదాలు హైజాక్ చేస్తారు. అక్క‌డ కొంత‌మంది అమాయ‌క ప్ర‌జ‌లు ఉంటారు. ఆ ఉగ్ర‌వాదుల నుంచి ఆ అమాయ‌క ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు విజ‌య్ ( రా ఏజెంట్ వీర‌రాఘ‌వ‌) ఏం చేశాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ. ఉమర్ ఫరూక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉగ్రవాదులు మాల్‌ను హైజాక్ చేస్తారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఉమ‌ర్‌ని వదిలేస్తుంది. ఆ త‌ర్వాత విజ‌య్ ఆ వ్య‌క్తిని ఎలా ప‌ట్టుకున్నాడు అన్న నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది.

విశ్లేష‌ణ :
వీర రాఘ‌వ‌న్ పాత్ర‌లో విజ‌య్ త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. పూజా హెగ్డే క్యూట్‌గా క‌నిపించింది. అయితే సినిమా అంతా విజ‌య్ వ‌న్ మ్యాన్ షో అయిపోయింది. ఉగ్ర‌వాదులు దాడి చేసే స‌మ‌యంలో విజ‌య్ పెర్పామెన్స్ ప్రేక్ష‌కుల‌కు మాంచి ఫీస్ట్ అందించింది. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు కామెడీ టైమింగ్‌తో పాటు పాప్ కార్న్ మూవీలా ఉంటుంది. సెకండాఫ్‌లో ముందు నుంచే సినిమా గ్రాఫ్ త‌గ్గుతూ వ‌స్తూ ఉంటుంది. కొన్ని రిపీటెడ్ స‌న్నివేశాల త‌ర్వాత సినిమా గ్రాఫ్ త‌గ్గిపోయి.. ప‌దే ప‌దే రిపీటెడ్ సీన్ల‌తో చివ‌ర‌కు బోరింగ్‌గా మారుతుంది.

గ‌తంలో సూప‌ర్ హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్ట‌ర్ నెల్స‌న్ ఈ సినిమాను ఆ రేంజ్‌లో ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు. కామెడీ మిక్స్ చేసి సినిమా ప్ర‌జెంట్ చేసినా ఆ కామెడీ కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం మెస్మ‌రైజ్ చేసింది. రేసీ స్క్రీన్ ప్లే బాగుంది. యాక్ష‌న్ బ్లాక్స్ ఆక‌ట్టుకున్నాయి. కేవ‌లం విజ‌య్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని.. హీరోయిజం ఎలివేట్ చేసేలా ఈ సినిమాను తీసిన‌ట్టు అనిపిస్తుంది.

రిలీజ్‌కు ముందు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అర‌బిక్ కుత్తు సాంగ్ స‌మ‌యంలో ఆడియన్స్ పూన‌కాలు వ‌చ్చిన‌ట్టు ఊగిపోతున్నారు. ఎడిటింగ్, నిర్మాణ విలువ‌లు, కెమెరా ప‌నితనం ప‌ర్వాలేదు. సెకండాఫ్ బోరింగ్‌తో పాటు ఎన్ఎస్ఐను వీక్ గా చూపించ‌డం కొంత‌మందికి న‌చ్చ‌దు.

ఫైన‌ల్‌గా..
బీస్ట్ ఓన్లీ ఫ‌ర్ విజ‌య్ ఫ్యాన్స్‌

బీస్ట్ TJ రేటింగ్ : 2 / 5