చేతబడి చేశారంటూ.. కోర్టును ఆశ్రయించిన హీరోయిన్.. ఎవరో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో జయచిత్ర కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఏఎన్నార్ ఎన్టీఆర్ కాలంలో హీరోయిన్గా ఎంతోమంది సినిమాల్లో నటించింది. తన అందంఅభినయంతో సినీ ప్రేక్షకులు అందరిని మెప్పించింది ఈమె. ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోవడంతో ఇక అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది జయచిత్ర. అయితే ఇలా సినీ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ ఎందుకో ఈమెకు మాత్రం మంచి బ్రేక్ రాలేదు అని చెప్పాలి. జయచిత్ర తర్వాత వచ్చిన వాళ్లు సైతం స్టార్ హీరోయిన్గా ఎదిగి తే జయచిత్ర మాత్రం అవకాశాలు లేక ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి.

సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి ఏ వార్త సోషల్ మీడియాలో కి వచ్చినా అది క్షణాల్లో వ్యవధిలో సెన్సేషన్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలనాటి హీరోయిన్ జయచిత్ర గురించి సంబంధించిన ఒక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తన ఇంట్లో అద్దెకుంటున్న ఒక వ్యక్తి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని అంతేకాదు చేతబడి కూడా చేశాడు అంటూ జయచిత్ర ఆరోపించింది. అంతేకాదండోయ్ ఇక తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఇక ఇటీవల న్యాయపోరాటంలో విజయం సాధించింది జయచిత్ర.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కోడంబాకం రంగరాజపురం లో జయచిత్ర కి ఒక ఇల్లు ఉంది. తన దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కలాన్ మురుగన్, మీనా దంపతులు ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే వాళ్లు రెంట్ చెల్లించలేదు.. కారు డ్రైవర్ కావడం నమ్మకంగా పని చేయడంతో ఇక జయచిత్ర కూడా ఎక్కువ ఒత్తిడి తీసుకు రాలేదు. ఇలా 12 ఏళ్ల పాటు ఎలాంటి అద్దె చెల్లించకుండానే జయచిత్ర ఇంట్లో ఉంటూ వచ్చారు.

అయితే అంతే కాకుండా అద్దె చెల్లించినట్లు కొన్ని పత్రాలు సృష్టించి ఇక ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న జయచిత్ర తన ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడని న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది.. అంతేకాదు తనపై కక్షతో సదరు వ్యక్తి చేతబడి కూడా చేసినట్లు అనుమానం కూడా ఉంది అంటూ న్యాయపోరాటం చేయగా.. కోర్టు ఇక ఆమెకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. దీంతో జయచిత్ర సమస్యల నుంచి బయట పడింది.

Share post:

Latest