సురేష్ బాబు, వెంకటేష్ భార్యలకు ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉందంటే న‌మ్ముతారా ?

దగ్గుబాటి రామానాయుడు.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుందేమో. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాతగా నటుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులు ఆయన. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా మూవీ మొగల్ అని కూడా పిలుస్తుంటారు. రామానాయుడు స్టూడియో స్థాపించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ సృష్టించారు ఈయన. అంతేకాదు ఇక దగ్గుబాటి రామానాయుడు ఎంతో మంది యువ హీరోలకు కూడా అవకాశాలు ఇచ్చారు అని చెప్పాలి.

ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా దక్కించుకున్నారు. ఇక పద్మశ్రీ పురస్కారాలను కూడా అందుకున్నారు దగ్గుబాటి రామానాయుడు. దగ్గుబాటి రామానాయుడు కు వెంకటేష్, సురేష్ బాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేష్ బాబు ప్రస్తుతం నిర్మాణ రంగంలో ఉంటే వెంకటేష్ హీరోగా రాణిస్తున్నారు. అయితే ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన మహిళలు మాత్రం ఎక్కడా సినిమా ఫంక్షన్లో కనిపించరు. దగ్గుబాటి రామానాయుడు భార్య రాజేశ్వరి గానీ ఇక ఆయన కొడుకుల‌ భార్యలు కానీ ఇప్పటివరకు ఎక్కడ సినిమా ఫంక్షన్లలో కనిపించలేదు.

ఇక వాళ్ళు ఎలా ఉంటారో కూడా కొంత మంది ప్రేక్షకులు ఇప్పటికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు.సురేష్ బాబు లక్ష్మి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఇక వెంకటేష్ నీరజను పెళ్లి చేసుకున్నారు. అయితే సురేష్ బాబు భార్య లక్ష్మి 30 ఏళ్లలో ఇప్పటివరకు ఏ సినిమా ఫంక్షన్ లో కనిపించలేదు. ఈమె వ్యాపార రంగ దిగ్గజం అయిన యలమర్తి నారాయణ చౌదరి కూతురు. సురేష్ బాబు భార్య లక్ష్మి కాకుండా నారాయణ చౌదరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆయన ప్రముఖ రాజకీయ వేత్త అయిన ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అల్లుడు. అయితే సురేష్‌బాబు భార్య లక్ష్మికి అటు వెంకటేష్ భార్య నీరజకు పెళ్లికి ముందు నుంచే చుట్టరికం ఉందట.

ఇక వెంక‌టేష్‌.. ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన పారిశ్రామిక‌వేత్త అచ్చిబాబు స్వ‌యానా తోడ‌ళ్లుల్లు. ఇక సురేష్ బాబు కి రానా – అభిరామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కూతురు కూడా ఉంది ఇక వెంకటేష్ కి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే ఇలా సినీ బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నప్పటికీ రామానాయుడు దగ్గర నుంచి వెంకటేష్ కు తెరమీద ప్రేక్షకులను అలరించినా… వారి భార్యలు మాత్రం తెర వెనుక అసలు ప్రేక్షకులకు కనిపించకుండా ఇంటిపట్టునే ఉన్నారు అనే చెప్పాలి..