ఆచార్య పై చిట్టిబాబు రివ్యూ…మెగా గాలి తీసేశాడుగా..!!

పాపం.. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లు.. ఎన్నో ఆశలతో మరెన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మెగాస్టార్ ఆచార్య..నేడు రిలీజై అభిమానులను నిరాశ పరిచింది. జనరల్ గా మెగాస్టార్ అంటే ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ, ఈ సినిమాలో అవి ఏం కనిపించలేదు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఫ్లాప్ అంటే కొరటాల శివకు మొదటి సారి మెగా హీరోస్ తో ఫ్లాప్ ను అందుకున్నాడు. ధియేటర్ లో ఆచార్య సినిమాను చూసి వచ్చిన జనాలు..ఇస్తున్న రివ్యూ వింటే సినిమా ఇంత దారుణంగా ఉందా అని అంటున్నారు.

మెయిన్ ఆచార్య సినిమా కి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ సరిగ్గ ప్రమోషన్స్ చేయకపోవడం..ఓవర్ కాన్ ఫిడెన్స్..మెగాస్టార్, రామ్ చరణ్ నటిస్తున్నారు సినిమా ఎలాగైన హిట్ అవుతుంది అనే ధీమా తో కొరటాల కధ పై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయాదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమా ఇంత ఘోరంగా దెబ్బతింటుందని అనుకోలేదంటూ జనాలు రివ్యూ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ను చూసిన యాక్టర్ త్రిపురనేని చిట్టిబాబు..సంచలనంగా మారింది. సినిమా ఫ్లాప్ అని చాలా మంది జనాలు చెప్పారు..కానీ చిట్టి బాబు చెప్పిన మాటలు వింటే ..మెగా ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తున్నాయి.

చిట్టిబాబు మాట్లాడుతూ..”ఆచార్య సినిమా గురించి ఏదో ఎక్స్ పెక్ట్ చేసి వెళ్ళాం. అక్కడ ఏం లేదు. మెగాస్టార్ అన్న పేరు ఉందే కానీ.. అక్కడ స్టోరీ నిల్. కొరటాల మార్క్ మిస్సైంది. ఆకాశం రేంజ్ లో ఊహించుకుని వెళ్లాము..కానీ నేల ను చూయించాడు కొరటాల. సినిమా డిజాస్టర్ ” అంటూ చెప్పుకొచ్చాడు. రిపోర్టర్..సినిమాకి మీరు ఎంత రివ్యూ ఇస్తారు అనగా..చిట్టి బాబు రిప్లై ఇస్తూ..” అబ్బే..ఈ సినిమాకి రివ్యూ రేటింగ్ వేస్ట్ ..ఏం లేదు” అంటూ మెగా ఫ్యాన్స్ ముందే చెప్పేశాడు. పక్కనే ఉన్న మెగా ఫ్యాన్ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అంటున్న కానీ..ఆయన తన పాయింట్ ని క్లీయర్ గా చెప్పేశాడు. దీంతో చిట్టిబాబు రివ్యూ వైరల్ గా మారింది.https://www.facebook.com/telugupopular/videos/1250162012181945/?extid=CL-UNK-UNK-UNK-AN_GK0T-GK1C

Share post:

Latest