ఆ హీరోయిన్ పూజ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఏమిటీ కథ..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ స్టార్ బ్యూటీ కోసం స్టార్ హీరోలందరూ పోటీ పడుతున్నారు. అమ్మడు ఏ సినిమాలో అడుగుపెడితే అది ఖచ్చితంగా హిట్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. దీంతో కేవలం తెలుగు స్టార్ హీరోలే కాకుండా ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ కూడా ఆమెను ఏరికోరి తమ సినిమాల్లో నటించాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే, తెలుగులో ఓ బడా నిర్మాత ప్రస్తుతం వరుసబెట్టి పాన్ ఇండియా మూవీలను పంపిణీ చేయడమే కాకుండో ఓ పేరుమోసిన హీరోతో ఏకంగా పాన్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ హీరోతో సినిమా స్టార్ట్ చేస్తున్న క్రమంలో, ఆ హీరో నటించిన మరో సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. దీంతో ఆ సినిమాలో సదరు స్టార్ బ్యూటీ నటించడంతో ఆమెను ఆకాశానికెత్తుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు.

ఈ హీరోయిన్ టాలీవుడ్‌కు దొరకడం మన అదృష్టమని.. అసలు ఇలాంటి హీరోయిన్ ఇప్పుడు చాలా అవసరమని..ఆమెది గోల్డెన్ లెగ్ అని అంటూ భజన మొదలెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు అసలు ఆ హీరోయిన్‌లో ఏముందని అంతగా భజన చేస్తున్నాడో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా ఇండస్ట్రీలో మరో హీరోయిన్ లేదన్నట్లుగా ఈ ప్రొడ్యూసర్ ఆమెను ఈ తీరుగా పొగడ్తలతో ముంచెత్తడం ఏమిటో అంటున్నారు సినీ క్రిటిక్స్.

Share post:

Popular