మహేష్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో మహేష్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారా అన అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పేలా లేదని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుండటంతో ఈ సినిమాను ముందుగా అనుకున్నట్లుగా మే 12న రిలీజ్ చేయడం కుదరని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీంతో ఈ సినిమాను మే నెలాఖరున రిలీజ్ చేయాలని వారు చూస్తున్నారట.

ఇప్పటికే పలుమార్లు వాయిదాపడ్డ సర్కారు వారి పాట చిత్రం ఇప్పుడు ఇలా మరోసారి తన రిలీజ్‌ను వాయిదా వేసుకోవడం ఏమిటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వేసవి బరిలో చాలా సినిమాలు వరుసగా ఉన్నాయని, ఇలాంటి తరుణంలో మహేష్ సినిమా మాత్రం మళ్లీ వాయిదా పడటం ఏమిటని వారు అంటున్నారు. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular