ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్.. అన్నింటికీ తారక్ ఎసరు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా తారక్ తన సత్తా చాటడంతో ఇప్పుడు తారక్ నెక్ట్స్ సినిమాలపై అందరి చూపు పడింది. కాగా ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన రికార్డులను బద్దలుకొట్టేందుకు మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తు్న్న కేజీఎఫ్ 2 రెడీ అవుతోంది. ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తారక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తారక్‌కు తను ఎప్పటినుండో అభిమానినని.. అయితే ఇప్పుడు తామిద్దరం మంచి స్నేహితులం అయ్యామని ఆయన అన్నారు. అయితే తారక్ కోసం తానొక పవర్‌ఫుల్ కథను రెడీ చేశానని.. అది తారక్‌కు కూడా వినిపించగా, ఆయనకు కూడా అది బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ కేజీఎఫ్ 2 సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్‌తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్, ఆ తరువాత తారక్‌తో సినిమాను ప్రారంభిస్తాడట. అయితే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు క్రియేట్ చేసే రికార్డులను తారక్ సింగిల్ హ్యాండ్‌తో బద్దలుకొట్టడం ఖాయమని ప్రశాంత్ నీల్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తారక్ తన పర్ఫార్మెన్స్‌తో ఓ సినిమాను ఎక్కడివరకైనా తీసుకెళ్లగలడని.. ఆయనతో చేయబోయే సినిమాలో ప్రేక్షకులు కోరే అన్ని అంశాలు పుష్కలంగా ఉంటాయని ప్రశాంత్ నీల్ అంటున్నాడు. మరి నిజంగానే తారక్ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాల రికార్డులను పాతర వేస్తాడా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular