ఆ విషయంలో పవన్ అలక.. పట్టించుకోని డైరెక్టర్..?

టాలీవుడ్ లో స్టార్ హీరో ఎవరు అంటే ముందుగా అందరి నోట వినిపించే పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కోట్లకి కోట్ల బడ్జెట్ లు పెట్టి.. సినిమాలు తీయ్యలేకపోయినా.. తీసిన సినిమా ల ద్వారా జనాలకు నాలుగు మంచి విషయాలు చెప్పామా..లేక నాలుగు పనికి వచ్చే సంగతులు గురించి తెలియజేశామా..లేక కడుపుబ్బ నవ్వించామా అనే చూసుకుంటారు కానీ.. సినిమా వల్ల లాభ పడ్డామా..మిగతా సంగతులు నాకెందుకు అని అనుకోని ఏకైక హీరో పవన్ అంటుంటారు అభిమానులు.

ప్రజెంట్ పవన్ కల్యాన్ పాలిటిక్స్ లో బిజీ గా ఉంటూనే కమిట్ అయిన సినిమాలను ఫటా ఫటా ఫినీష్ చేసే పనుల్లో ఉన్నాడు. రీసెంట్ భీంలా నాయక్ తో క్రేజీ హిట్ ని అందుకున్న ఈ పవర్ స్టార్.. నెక్స్ట్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో ఓ పవర్ ఫుల్ సినిమాకి కమిట్ అయ్యాడు అన్న సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్షన్ లో పవన్ హరి హర వీర మల్లు అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ ఎప్పుడు టచ్ చేయని జోనర్ లో వజ్రాల దొంగగా కనిపిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే 60 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పై పవన్ ఫుల్ డిస్సపాయింట్ మెంట్ లో ఉన్నారట.

దానికి కారణం లేకపోనూ లేదు. క్రిష్ పవన్ కి స్టోరీ వివరిచినప్పుడు ఈ సినిమా మధ్యయుగంలో భారతదేశంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతుంది.. సో కాస్ట్యూమ్ స్ కూడా అలా ఉంటాయి అని ఫుల్ క్లారిటీతో అద్దిరిపోయే రేంజ్ లో చెప్పారట. కానీ తీరా తెరకెక్కే సమయంలో మాత్రం క్రిష్ వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ..ఉన్న వాటితోనే సరిపెడుతున్నాడని.. స్టోరీకి తగ్గట్టు కాస్ట్యూమ్స్ లేవని.. కొన్ని సీన్స్ మరి దారుణంగా ఉన్నా క్రిష్ ఏదో మొక్కుబడిగా మమ అనిపించేస్తున్నాడని పవన్ కోపంగా ఉన్నారట. మ‌రోవైపు సినిమాలోని పాత్రలు కూడా చాలా మోడ్రన్‌గా, కొత్తగా కనిపిస్తున్నాయని..అసలు లుక్‌ ఆధారంగానే క్రిష్‌ కాస్ట్యూమ్స్‌ను ఎక్కువగా డిజైన్ చేశాడ‌ని పవన్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విషయం పవన్ సన్నిహితులు క్రిష్ కి చెప్పిన పెద్దగా పట్టించుకోవడం లేదట క్రిష్. దీంతో పవన్ క్రిష్ పై అలిగిన్నట్లు..గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి క్రిష్ పవన్ అలక్ తీరుస్తాడో లేదో చూడాలి..?

Share post:

Latest