మెగాస్టార్ సినిమాల్లో అమ్మడు లేదు.. కుమ్ముడు లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

అయితే మెగాస్టార్ ఆచార్యతో పాటు తన నెక్ట్స్ సినిమాల్లోనూ ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ఆచార్య సినిమాలో చిరు సరసన హీరోయిన్ లేదనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆచార్య పాత్రకు రొమాంటిక్ టచ్ అద్దితే, అది ఆయన పాత్రకు సెట్ కాదని ఏకంగా హీరోయిన్ కాజల్‌కు సంబంధించిన సీన్స్‌నే తీసేశారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ చిరు నెక్ట్స్ మూవీకి కూడా ఉండబోతుంది.

తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాలోనూ మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ లేదు. ఈ సినిమాలో నయనతార నటిస్తున్నా, ఆమెది ఓ కీలక పాత్ర మాత్రమే అని తెలుస్తోంది. అయితే ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చిరంజీవికి రొమాంటిక్ ట్రాక్స్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా నిరాశకు లోనవుతరానేది ఖాయం. మరి వారిని అలా నిరాశకు లోనవకుండా చిరు ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.

Share post:

Popular