ఆచార్య : మంచు విష్ణు ఘాటు ట్వీట్..టైం చూసి కొట్టాడురోయ్..?

ఇప్పుడు ఎక్కడ చూసిన ఒక్కటే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆచార్య సినిమా రిజల్ట్. ఎన్నో అంచనాల నడుమ నేడు గ్రాండ్ గా ధియేటర్స్ లో విడుదలైన ఆచార్య ..ఫస్ట్ షోతోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ముందు కొరటాల శివ తీసిన సినిమాల ఎఫెక్ట్ కారణమో..లేక సినిమా నిజంగానే మెగా అభిమానులకు నచ్చలేదో తెలియదు కానీ.. అభిమానుల అంచనాలు తాకలేకపోయాడు కొరటాల శివ. ఓకే.. క్రికెట్ అన్నాక ఓడిపోవడం..సినిమా అన్నాక ఫ్లాప్ అవ్వడం జరుగుతుంటాయి. ఆ విషయాని గుర్తుంచుకుని మనంలో లైఫ్ లో ముందుకు వెళ్తుండాలి.

ఇంతకముందు మెగాస్టార్ సినిమాలు ఫ్లాప్ అవ్వలేదా అంటే.. అయ్యాయి . కానీ, ఎందుకో ఈ సినిమా పై జనాలు ఎక్కువుగా టార్గెట్ చేస్తున్నారు. సినిమా నచ్చిందా..నచ్చలేదా అనే విషయం చెప్పి సైలెంట్ అవ్వకుండా..కావాలనే మెగా హీరోస్ అందరిని ఎత్తి చూపుతున్నారు. ముందుగానే మెగా ఫ్యామిలీ అంటే పడని ఓ సో కాల్డ్ కుళ్లు బ్యాచ్..కి ఆచార్య ఫ్లాప్ ప్లస్ అయ్యింది. ఈ ఒక్క సాకుతో మెగా ఫ్యామిలీని ఆడేసుకుంటున్నారు. అంతేనా చరణ్ తదుపరి సినిమా శంకర్ తో కూడా ఫ్లాప్ అవుతుందని..జోష్యం చెప్పుతున్నారు. ఈ క్రమంలోనే నెట్టింట ఓ ట్వీట్ వైరల్ గా మారింది.

మా ప్రెసిడెంట్ గా ఉన్న మంచు విష్ణు..ఈ మధ్య కాలంలో ఏదో ఒక విషయం గా నెట్టింట హాట్ టాపిక్ గా నే నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపుతుంది. ఉదయం 5 గంటలకే ఈ ట్వీట్ చేయడం గమనార్హం. “డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయి” అంటూ ట్వీట్ చేశాడు. అస్సలు విష్ణు ఈ ట్వీట్ ఎందుకు చేశాడొ తెలియదు కానీ.. కొందరు ట్రోలర్స్ ఈ ట్వీట్ కి ఆచార్యసినిమా రిజల్ట్ కి ముడి పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. మొహన్ బాబు రీసెంట్ గా నటించిన సినిమా son of india flop అయ్యిన్నప్పుడు మెగా ఫ్యాన్స్ మంచు ఫ్యామిలీని గట్టిగానే ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు ఇలాంటి టైం లో మంచు విష్ణు పరోక్ష ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Latest