అక్కడ ఆర్ఆర్ఆర్‌ను బీట్ చేసిన కేజీయఫ్2

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీయఫ్2 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. కేజీయఫ్ చాప్టర్-1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రావడంతో కేజీయఫ్-2 చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఫస్ట్ డే కలెక్షన్స్, బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా కేజీయఫ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయగా.. తాజాగా ఈ సినిమా మరో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్‌ను సైతం ఓవర్ టేక్ చేసింది. కేరళలో డబ్బింగ్ చిత్రాల్లో ఇప్పటివరకు అత్యధికంగా వసూళ్లు చేసిన సినిమాగా ఆర్ఆర్ఆర్ రూ.23 కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది.

అయితే ఆర్ఆర్ఆర్ సాధించిన కలెక్షన్లను కేజీయఫ్2 తాజాగా క్రాస్ చేసింది. కేరళలో ఇలాంటి రికార్డు మరే ఇతర డబ్బింగ్ సినిమాకు లేకపోవడం గమనార్హం. రాకింగ్ స్టార్ యశ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఇక అధీరా పాత్రలో సంజయ్ దత్ నటించగా, ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసింది. మున్ముందు కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Share post:

Popular