ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇంత ఘోర‌మైన డిజాస్ట‌ర్ సినిమా కూడా ఉందా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు నటుడిగా, రాజకీయవేత్తగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇక ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే ఎన్టీఆర్ కెరియర్లో కూడా ఒక డిజాస్టర్ మూవీ ఉన్నది..అయితే ఈ విషయం చాలామందికి తెలియక పోవచ్చు.. 1960లో విడుదలైన ఆ చిత్రం ఏమిటి..? వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎన్టీఆర్ కాడెద్దులు ఎకరం నేల అనే సినిమాలో నటించారు . ఈ చిత్రం 1960 లో విడుదలైంది. ఇక ఆ ఏడాది 10 సినిమాలు ఎన్టీఆర్ నటించినవి విడుదలయ్యాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి పాత్రలో నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా కూడా విడుదలైంది. ఇక ఎన్టీఆర్ బాగా ఫుల్ జోష్ లో ఉన్న తరుణంలో కాడెద్దులు ఎకరం నేల సినిమా విడుదలై భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అంతకుముందు ఎన్టీఆర్ తో దైవబలము చిత్రాన్ని నిర్మించిన పొన్నలూరి బ్రదర్స్ ఈ సినిమాని నిర్మించారు.

ఎన్టీఆర్ తో బట్టి విక్రమార్కుడు చిత్రాన్ని రూపొందించిన జంపన్న కాడెద్దులు ఎకరం నేల చిత్రానికి దర్శకులుగా వ్యవహరించారు. ఇందులో ఎన్టీఆర్ చాలా పేద రైతు గా నటించారు. ఆయన సరసన షావుకారు జానకి హీరోయిన్ గా నటించింది. రేలంగి మరో కీలకమైన పాత్రలో నటించారు. ఇక బట్టి విక్రమార్కుడు చిత్రం 1961లో అక్టోబర్-1న విడుదల కాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక అదే సమయంలో ఈ డైరెక్టర్ తోనే కాడెద్దులు ఎకరం నేల అనే సినిమా వారం రోజుల గ్యాప్ తో విడుదలయింది.

ఇక ఈ సినిమా చూడడానికి జనం చాలా ఎగబడ్డారు. కానీ సినిమా చూసిన వారంతా తరువాత నిరాశ చెందారు. అయితే చిత్రబృందం సన్నివేశాలు అయితే బాగా పండుతాయి అనుకున్నారు అవి ఏవి ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ చిత్రం ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ విధంగా తన కెరీర్ లోనే ఒక భారీ డిజాస్టర్ చిత్రాన్ని మిగిల్చుకున్నారు ఎన్టీఆర్.