అనిల్‌కుమార్‌కు జ‌గ‌న్ మార్క్ చెక్‌.. మామూలుగా లేదే…!

ఇత‌ర పార్టీల సంగ‌తి ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో మాత్రం భిన్న‌మైన రాజ‌కీయాలు క‌నిపిస్తాయి. దూకుడుగా ఉన్న నాయ‌కుల‌కు ముకుతాడు వేయ‌డంలో పార్టీ అధినేత జ‌గ‌న్ ముందుంటారు. ఆయ‌న ఎవ‌రు చెప్పినా.. విన‌రు. కానీ, అదేస‌మ‌యంలో తాను చేయాల‌ని అనుకున్న‌ది చేస్తారు. ఇలానే.. తాజాగా మాజీ అయిన‌.. నెల్లూరుకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ విష‌యంలోనూ.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న దూకుడుకు అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేశారు. నిజానికి మంత్రికి ముందు నుంచి కూడా అనిల్ దూకుడు అంద‌రికీ తెలిసిందే.

అయితే.. మంత్రి అయిన త‌ర్వాత‌.. కూడా ఆయ‌న దూకుడు పెంచారు కానీ, జ‌గ‌న్‌కు ఇది న‌చ్చ‌లేదని వైసీపీలోనే గుస‌గుస కొన్నాళ్ల‌పాటు వినిపించింది. ఎందుకంటే.. ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జ‌ల‌వ‌న‌రుల మంత్రిని చేశారు. మూడేళ్ల పాటు.. ఆయ‌న ఈ ప‌ద‌విలో ఉన్నారు. అయితే.. మంత్రిగా ఉన్నా.. ఆయ‌న స‌బ్జెక్ట్‌పై దృష్టి పెట్ట‌లేక పోయారనే అప‌వాదు ఉంది. ఇప్ప‌టికీ.. పోల‌వ‌రం గురించి ఆయ‌నకు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న లేదు. ఇక‌, ఇత‌ర ప్రాజెక్టుల విష‌యంలోనూ.. ఆయ‌న కు అంతంత మాత్ర‌మే నాలెడ్జ్ అని తాడేప‌ల్లిల వ‌ర్గాలు కూడా చెప్పారు. కాళేశ్వ‌రం, సీమ ఎత్తిపోతల వివాదం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్ప‌డు.. మంత్రిసైలెంట్ అయ్యారు.

దీంతో స్వ‌యంగా జ‌గ‌నే వాటిపై పోరాటం చేయాల్సి వ‌చ్చింది. దీంతోనే ఆయ‌న‌ను మంత్రిగా ప‌క్క‌న పెట్టార‌నే టాక్ నెల్లూరులో జోరుగా వినిపించింది. మంత్రి ప‌ద‌వి పోయినా ఆయ‌న‌లో మార్పు క‌నిపించ‌లేదు. దఅంతేకాదు.. సొంత పార్టీ నేత‌ల‌పైనే ఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. చివ‌రిక అధిష్టానం జోక్యం చేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో కొంత త‌గ్గినా.. ఆయ‌న‌ను ఏకంగా జిల్లాతో ఉన్న సంబంధాల‌ను తెగేసేలా జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా ప్ర‌క‌టించిన వైసీపీ జిల్లా కోఆర్డినేట‌ర్ల‌.. జాబితాలో.. దాదాపు ఎక్క‌డివారికి అక్క‌డే జిల్లాల‌ను అప్ప‌గించారు.

కానీ, అనిల్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం.. ఎకక్క‌క‌డో ఉన్న జిల్లాల‌ను తీసుకువ‌చ్చి.. ఆయ‌న చేతిలో పెట్టారు. వీటిలోనూన‌.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా ఉండ‌డం గ‌మ‌నార్హం. తిరుప‌తి, క‌డ‌ప జిల్లాల‌కు వైసీపీ కో ఆర్డినేట‌ర్‌గా అనిల్ ను నియ‌మిస్తూ.. తీసుకున్న నిర్ణ‌యంపై నెల్లూరులో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న‌ను కావాల‌నే అక్క‌డ‌కు పంపించార‌ని అంటున్నారు. జిల్లాలోనే ఉంటే.. నిత్యం ఏదోఒక వివాదంతో కాలం వెళ్ల‌దీస్తార‌ని.. భావించిన అధిష్టానం.. ఆయ‌న‌కు దూరంగా ఉన్న క‌డ‌ప‌.. తిరుప‌తి జిల్లాల బాధ్యుడిని చేయ‌డం వెనుక దూకుడును త‌గ్గించాల‌నే ఫార్ములా ఉంద‌ని అంటున్నారు.