బాగా హర్ట్ చేశారు..చిరంజీవి ఇలా చేస్తాడు అని అనుకోలేదబ్బా…!!

మెగాస్టార్ చిరంజీవి..అంటే ఇండస్ట్రీలో అందరికి ఓ గౌరవం. అందరిని సమానంగా చూస్తారని..ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారని అంటుంటారు. అయితే, రీసెంట్ గా జరిగిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పద్ధతి కొంతమందికి నచ్చలేదు. దీంతో చిరంజీవి, చరణ్ ని, కొరటాల శివ ని ముగ్గురిని జనాలు నెట్టింట విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ మ్యాటర్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే ఆచార్య సినిమాలో ఇద్దరు హీరోయిన్లు గా చేస్తున్నారు. ఒకరు కాజల్ అగర్వాల్, మరోకరు పూజా హెగ్డే. అందాల చందమామ కాజల్ చిరంజీవికి జోడీ గా నటిస్తే.. బుట్టబొమ్మ పూజా చరణ్ కు జోడీ గా నీలాంబరి పాత్రల్లో నటిస్తుంది . నిజానికి కాజల్ ని ఈ పాత్రకి చూస్ చేసే ముందు బోలెడు మంది హీరోయిన్ లని అనుకున్నారట కొరటాల. లాస్ట్ కి త్రిష ఫిక్స్ అయ్యి..రెండు మూడు షాట్స్ చేసిన తరువాత ..కొన్ని కారణాల వల్ల సినిమా నుండి తప్పుకున్నిందట త్రిష. దీంతో మళ్ళీ హీరోయిన్స్ కోసం హంటింగ్ మొదలు పెట్టిన శివ..ఫైనల్ గా కాజల్ ని సెలక్ట్ చేశారు.

షూటింగ్ టైం లో కూడా కాజల్ చిరు తో ఆడుతూ పాడుతూ..సరదాగా చేసేసింది.. ఫైనల్ షెడ్యూల్ లో తాను తల్లి కాబోతున్నట్లు తెలిసి..చక చకా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్యాకప్ చెప్పేసి..ఇంట్లోనే రెస్ట్ తీసుకుని..పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ పేరుని ఎక్కడ ప్రసావించలేదు చిరు, చరణ్, కొరటాల. నిజానికి ఆమె పెద్ద హీరోయిన్..ఇద్దరితో ఇది వరకే సినిమా లు తీసింది..అవి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి కూడా. కానీ కాజల్ పేరుని ఎత్తకుండా.. కనీసం ఆమె బిడ్డ పుట్టిన విషయం కూడా గుర్తు చేసుకోకుండా.. ఈవెంట్ ని ముగించేయడం ఆమె ఫ్యాన్స్ కి నచ్చడంలేదు. దీంతో చిరు పద్ధతి బాగోలేదని..నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్.

Share post:

Popular