అలా చేస్తే వాళ్ళు రాజమౌళిని చంపేస్తారు.. తారక్ మాటలకు సినీ ఇండస్ట్రీ షాక్..!!

వాట్..రాజమౌళిని చంపేస్తారా..? ఎవరు..ఎందుకు అనుకుంటున్నారా..? ఖంగారు పడకండి..ఆ మాటలు తారక్ సరదాగా అన్నారు అంతే. నిజంగా అలా ఎవరు చేయరులేండి. దర్శక ధీరుడు రాజమౌళి కి ఎంతటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ స్టార్ హీరోకి సరిసమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది జక్కన్న కి. ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లల్లో ఎవరికి ఇలాంటి ఫ్యాన్ బేస్ లేదు. ఆ క్రెడిట్ ఒక్క రాజమౌళికే దక్కింది.

రీసెంట్ గా RRR సినిమా ను తెరకెక్కించిన రాజమౌళి ఈ సినిమా ద్వారా ఎలాంటి విజయం అందుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియన్ సినిమా చరిత్రలోనే RRR ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఓవర్ ఆల్ గా ఇప్పటి వరకు 900 కోట్లు కలెక్ట్ చేయగా..ఖచ్చితంగా 1000 కోట్లు దాటేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే నైజాం లో ఏ సినిమా సాధించని రికార్డ్ ను సొంతం చేసుకుంది RRR. ఒక్క నైజాం ఏరియాలోనే 100 కోట్లు కలెక్ట్ చేసి..బాక్స్ ఆఫిస్ వద్ద కని విని ఎరుగని రికార్డ్ నెలకోల్పింది.

ఇక బాలీవుడ్ లో ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గా ముంబై లో జరిగిన RRR సక్సెస్ మీట్ పాల్గొన్న చరణ్-తారక్-రాజమౌళి..సినిమా ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల..ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే RRR కి సీక్వెల్ ఉంటుందా అన్న ప్రశ్న ఎదురైన సంధర్భంలో తారక్ ఆన్సర్ ఇస్తూ..” RRR ఫైనల్ గా ఎలా ముగిసిందో అందరూ చూశారు. చాలా మంది ఈ సినిమాకి సీక్వెల్ కావాలని రావాలని కోరుకుంటున్నారు. మాకు కూడా RRR 2 వస్తే బాగుంటుంది అని ఉంది. ఒకవేళ జక్కన్న సీక్వెల్ తీయకపోతే.. RRR 2 కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ వచ్చి ఆయనను చంపిన చంపేస్తారు’’ అంటూ సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు రాజమౌళి ఇప్పుడు పిలిచినా షూటింగ్ రెడీ అంటూ చరణ్-తారక్ చెప్పుకొచ్చారు. వీళ్ల మాటలు బట్టి చూస్తే.. RRR సీక్వెల్ త్వరలోనే రావచ్చు అంటున్నారు సినీ ప్రముఖులు.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space