జోరు తగ్గని బాలయ్య.. ఆగడమే లేదుగా!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో బాలయ్య ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నుండి ఈ షెడ్యూల్ నిర్విరామంగా సాగుతుందని, ఇందులో కొన్ని కీలక సన్నీవేశాలతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

కాగా గోపీచంద్ మలినేని ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, ఇందులో బాలయ్య రెండు విభిన్న లుక్స్‌లో మనకు దర్శనమిస్తాడు. ఇక బాలయ్య సరసన ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో బాలయ్య మరోసారి అఖండ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Share post:

Popular