హవ్వా..ఆ డైరెక్టర్ కాజల్ ని వాడుకుని వదిలేశారా..ఎంత ఘోరం అంటే..?

కాజల్ అగర్వాల్..పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. చూడటానికి చక్కటి రూపం..చూడగానే ఆకట్టుకునే అందం..ఆ నవ్వు..నటనలో కూడా మంచి స్కిల్స్..దీంతో కాజల్ ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే దాదాపు అందరు బడా స్టార్స్ తో జత కట్టి..బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దశాబ్ధ కాలంగా కాజల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే.

అప్పుడెప్పుడో తేజ డైరక్షన్ లో లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్.. మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న “ఆచార్య” సినిమాలోను హీరోయిన్ గా చేసిందంటే అమ్మడు క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కెరియర్ కాస్త వెనుకపడినట్టు అనిపించిన ప్రతిసారి మళ్లీ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది కాజల్. ప్రస్తుతం కడుపుతో ఉన్న ఈ ముద్దుగుమ్మ ..తాను నటించిన ఆచార్య కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు గత కొన్ను నెలలుగా అభిమానులతో చెప్పుతూనే వస్తుంది.

అయితే రీసెంట్ గా ఆచార్య సినిమాలో కాజల్ రోల్ గురించి..ఆ సినిమా లో ఆమె నిడివి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి ఆచార్య సినిమాలో హీరోయిన్ గా ఎవ్వరిని పెట్టాలా..చిరు పక్కన ఎవరు సూట్ అవుతారా అని..కొరటాల దాదాపు 8 నెలలు తర్జనభర్జన పడ్డారు. ఫైనల్ గా క్రేజ్ ఉన్న కాజల్ ని సెలక్ట్ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. మధ్యలో చరణ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం..ఆయన కు జోడీగా పూజా రావడంతో కాజల్ రోల్ ని కొంచెం కొంచెం గా కట్ చేస్తూ వచ్చారట కొరటాల. ఇప్పుడు ఫైనల్ గా పూర్తి సినిమా పరంగా చూస్తే కాజల్ మనకు కనిపించే టైం చాలా తక్కువ అంటున్నారు సినీ మేకర్స్. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో నటించలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా కాజల్ ఫ్యాన్స్ ని డీప్ గా హర్ట్ చేస్తున్నారు కొరటాల అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి సీన్ కనపడుతుందో..?

Share post:

Popular