ఇండస్ట్రీలోకి మరో వారసుడు..ఫ్యామిలీ ఫ్యామిలీలు బ్రతికేస్తున్నాయే..?

ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుందా.. కోట శ్రీనివాస్ రావు ను ఉద్దేసించి..” వాడు పోతే వీడు ..వీడు పోతే నేను..నేను పోతే..నా అమ్మ మొగుడు అంటూ ఎవ్వరైన అధికారం కోసం ఎగబడి తే”..అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు. సినిమాకి విజయానికి ఆ డైలాగ్ బాగా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు అదే డైలాగ్ ని చెప్పుతున్నారు జనాలు. అందుకు కారణం లేకపోను లేదు. సినీ ఇండస్ట్రీలో హీరోలకు కొదవ లేదు. బోలెడు మంది ఉన్నారు. వస్తున్నారు..వస్తూనే ఉంటారు కూడా..

అయితే సామాన్య ప్రజలల్లోను టాలెంట్ ఉంటుంది. వాళ్ళకి నటించాలని ఉంటుంది. కానీ, అవకాశాలు రావు. కాదు కాదు రానివ్వరు. వారసత్వం అన్న పేరుతో సినీ ఇండస్ట్రీని కబ్జా చేసేస్తున్నారు కొన్ని ఫ్యామిలీలు. మరీ ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో అయితే నాలుగు ఫ్యామిలీలే రాజ్యమేలుతున్నాయి. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీలో కి వచ్చి హీరో గా సెటిల్ అయిన హీరోలు ఎంత మంది ఉన్నారు.. లెక్కేయండి. ఫింగర్ కౌంటింగ్స్ కన్నా తక్కువే,..ఉంటారు .

అదే..తాతల పేరు, నాన్న పేరు.. అమ్మ బంధువులని..పిన్నమ్మ రిలిటీవ్స్ అని.. డైరెక్టర్ కొడుకులు, నిర్మాతల కొడుకులు.. వాళ్ళ అల్లుడులు..తమ్ముడు కొడుకులు..బిడ్దలు..ఇలా అందరు వాళ్ల వాళ్ల ఫ్యామిలీలకు బెర్త్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ విన్న రవి..కి స్టోరీ బాగా నచ్చేసిందని.. తన కెరీర్ కు బిగ్గెస్ట్ హెల్ప్ చేసిన అనిల్ రావిపూడితోనే తన కొడుకు ఎంట్రీకి సిద్ధపడ్డాడని..ఇందుకు మూహుర్తం కూడా ఫిక్స్ చేశాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒక్కవేళ్ల ఇదే జరిగితే.. నెక్స్ట్ తరం ..ఆ నెక్స్ట్ తరం కూడా ఇండస్ట్రీలో సామాన్య ప్రజలకు అవకాశం లేనట్టే. దీంతో ఫ్యామిలి ఫ్యామిలీలు ఇండస్ట్రీని కబ్జా చేసేస్తూ..బ్రతికేస్తున్నాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మరి దీని పై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి..?