మా సితార అలా ఎప్పటికి చేయదు..వాళ్లు నమ్రతను అంతలా హర్ట్ చేసారా..?

సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. టాలీవుడ్ నే కాదు అన్ని భాషల్లలోను ఇలానే ఉంటుంది. తల్లిదండ్రుల పేరు చెప్పుకుని..తాతల పేరులు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అయిన వారు బోలెడు మంది ఉన్నారు. బాలీవూడ్ లో అయితే దాదాపు 90శాతం అందరు వారసులే రాజ్యమేలుతున్నారు. ఇక టాలీవుడ్ లోను నాలుగు ఫ్యామిలీల మధ్య అంతా నడుస్తుంది. ఇప్పుడు స్టార్ హీరోల పిలల్లు చైల్డ్ ఆర్టిస్ట్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో మరో తరం కూడా వాళ్లే కవర్ చేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హా..శాకుంతలం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక స్టార్ డాటర్ మహేష్ కూతురు సితార కూడా తండ్రి సినిమాతోనే తన ఎంట్రీని రెడీ చేసుకుంది. మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో సితార ఓ సాంగ్ లో కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. సితార డ్యాన్స్ బాగా చేస్తుంది. ప్రత్యేకంగా డ్యాన్స్ నేర్చుకుంటుంది. అంతేకాదు..ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ,,ఫోటో షూట్ లు కూడా చేస్తుంటుంది. దీని పై కొందరు పాజిటీవ్ గా రెస్పాండ్ అయితే మరికొందరు చిన్న పాప అని కూడా చూడకుండా తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి వాళ్ళకి మహేష్ భార్య నమ్రత అద్దిరిపోయే సమాధానం ఇచ్చింది. రీసెంట్ గా ఆమె మాట్లుడుతూ..సితార పై వాళ్లకు నమ్మకం ఎక్కువ అని చెప్పుకొచ్చింది. ” మా పాపకు ఇప్పుడు 9 ఏళ్లు. తనకు మంచి ఏదో..చెడు ఏదో..మేము చెప్పుతున్నాం. తన ఇష్టాలకు అనుగుణం గానే వెళ్తున్నాం. మా పాప ఏ నాడు తన లిమిట్స్ క్రాస్ చేయదు. మా దగ్గర అలా చెప్పించుకోదు. సితార మల్టీ టాలెంటెడ్. ఇంత చిన్న వయసులోనే సితారకు దక్కిన ఈ గుర్తింపు తల్లిదండ్రులుగా తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని “చెప్పుకొచ్చారు నమ్రత.

Share post:

Popular