చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రేటింగ్ అండ్ రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం ఎప్పుడో రిలీజ్ కవాల్సి ఉన్నా, అనేక కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ మూవీపై మెగాఫ్యాన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వేసవి కానుకగా ఈ సినిమాను నేడు(ఏప్రిల్ 29) ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. మరి మెగాస్టార్ చాలా కాలం తరువాత చేసిన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం

కథ:
ధర్మస్థలి, పాదఘట్టం ప్రాంతాల చుట్టూ ఈ కథ సాగుతుంది. పాదఘట్టంలోని జనం మూలికావైద్యం చేస్తూ ఉంటారు. అయితే బసవ(సోనూసూద్) ధర్మస్థలిని తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తాడు. అయితే ఈ క్రమంలో ధర్మస్థలిలో ఎంట్రీ ఇస్తాడు ఆచార్య(చిరంజీవి). వడ్రంగిగా వచ్చిన ఆచార్య, అక్కడ జరిగే అన్యాయాలను చూసి ఎదురించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే బసవకు ఎదురెళ్లి పాదఘట్టం ప్రాంత వాసులను కాపాడతానని మాటిస్తాడు. అయితే అసలు ఆచార్య ధర్మస్థలిలో ఎందుకు అడుగుపెట్టాడు.. అతడు ఇక్కడికి రావడానికి ఎవరు కారణం.. సిద్ధ ఎవరు..? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మూవీ కథనం బాగున్నా, ఆయన తీసుకున్న సింపుల్ పాయింట్ మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇక ఈ సినిమాలో ఆచార్య పాత్రను ఆయన చూపించిన విధానం మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవిని ఇలా చూసి అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక ఫస్టాఫ్‌లో ఆచార్య ఎంట్రీ, ధర్మస్థలిలో జరిగే అన్యాయాలను చూసి చలించిపోయిన ఆచార్య ఒక్కొక్క సమస్యను తీరుస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడు ఎవరు.. అసలు అతడిని ఇక్కడికి పంపింది ఎవరు.. అనే విషయాలను రివీల్ చేస్తూ సిద్ధ ఎంట్రీతో ఇంటర్వెంల్ బ్యాంగ్ వస్తుంది.

సెకండాఫ్‌లో పాదఘట్టం వాసులకు పసికందుగా దొరికిన సిద్ధ(రామ్ చరణ్)ను వారే పెంచి పెద్ద చేస్తారు. ధర్మస్థలిలో ఎప్పుడూ ధర్మం ఉండాలని కోరుకునే వ్యక్తిగా సిద్ధ అందిరతో కలిసిమెలిసి ఉంటాడు. ఇక నీలాంబరి(పూజా హెగ్డే)ను ప్రేమించే సిద్ధ, ధర్మస్థలి ఆలయాన్న కూల్చే ప్రయత్నం చేస్తున్న కొందరిని అడ్డుకునేందుకు అతడు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ఈ క్రమంలోనే అతడిని కత్తితో పొడుస్తాడు బసవ. అప్పుడే కొందరు అతడిని అక్కడిని నుండి తీసుకెళ్లడం.. ఈ క్రమంలోనే అతడి ఫ్లాష్‌బ్యాక్ చెప్పడంతో అతడు కూడా నక్సలైట్లతో చేతులు కలుపుతాడు.

అయితే ఈ క్రమంలో ఓసారి ఆచార్యపై జరిటే అటాక్‌ను అడ్డుకునే క్రమంలో సిద్ధ మరణిస్తాడు. దీంతో ఎలాగైనా పాదఘట్టం ప్రాంతాన్ని కాపాడాలని.. చరణ్ కోరిక నెరవేర్చాలని ఆచార్య అక్కడకు చేరుకుంటాడు. పాదఘట్టం వారు ఈ విషయం తెలుసుకుని తమ పాదఘట్టం ఆచారం మేరకు దేవతకు పూజలు నిర్వహిస్తారు. ఇక క్లైమాక్స్‌లో విలన్ అండ్ గ్యాంగ్‌ను మట్టుబెట్టి పాదఘట్టం, ధర్మస్థలిని కాపాడతాడు ఆచార్య.

ఓవరాల్‌గా ఈ సినిమా కథ చాలా పాతదే అయినా కూడా కొరటాల కేవలం మెగాస్టార్ అనే ఇమేజ్‌తోనే ఈ సినిమాను నెట్టుకురావచ్చిన బొక్కబోర్లా పడ్డాడు. ఇలాంటి రొటీన్ కథలకు ఎప్పుడో నూకలు చెల్లాయని ఆయన గ్రహించకపోవడం చాలా బాధాకరం. ఏదేమైనా మెగాస్టార్, మెగా పవర్ స్టార్ లాంటి స్టార్స్‌ను పెట్టుకుని కూడా ఇలాంటి సినిమాను చేస్తాడని ఎవరూ ఊహించరు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాలో ఆయన నటనటకు ఫిదా అవుతారు. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. వీరిద్దరు కలిసి స్క్రీన్‌పై కనిపించినప్పుడు ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నా వారి పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు. ముఖ్యంగా పూజా హెగ్డే పాత్ర కూడా సోసో గా ఉండటం అభిమానులను నిరాశకు గురిచేసింది.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఆచార్య సినిమా కోసం అదిరిపోయే కథను రాశానని గొప్పలు చెప్పిన కొరటాల ఈ సినిమాను ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సినిమాలో అసలు మెయిన్ ప్లాట్ చాలా చప్పగా ఉండటంతో తరువాత ఏం జరుగుతుందో అని అందరూ ముందుగానే ఊహించేస్తారు. ఇక సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ధర్మస్థలి ప్రాంతానికి సంబంధించిన సీన్స్ బాగున్నాయి. మణిశర్మ సంగీతం ఒకట్రెండు పాటల మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

చివరగా:
ఆచార్య – మెగా ఫ్లాప్!

రేటింగ్:
2.0/5.0

Share post:

Popular