ఆచార్య రిజల్ట్: ఇప్పుడేం అంటావ్ రాజమౌళి..?

పాపం..ఈగ సినిమాలో కేవలం అరగంట కూడా లేని హీరో నాని క్యారెక్టర్ డిజైన్ చేసిన రాజమౌళి..ఆయన కి ఎన్ని ఫ్లాప్ సినిమా లు పడ్డాయో మనకు తెలియనదికాదు. ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ వర్క్ అవుట్ అయ్యిందా..అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మనకు తెలిసిందే.. ఇండస్ట్రీలో రాజమౌళి ఎవరితో నైన సినిమా తీస్తే..ఆ హీరో తరువాత సినిమా అడ్రెస్ లేకుండా పోతుంది. బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తుంది. ఇదే విషయాని మీడియా వాళ్లు..పలువురు సినీ ప్రముఖులు అంటున్న రాజమౌళి పట్టించుకోలేదు.

అంతేందుకు.. మొన్నటికి మొన్న RRR ప్రమోషన్స్ లో కూడా ఇదే విషయాని ఓ రిపోర్టర్ అడగ్గా..ఫైర్ అవుతూ..”ఈ క్వశ్చన్ నేను ఇప్పటికే చాలాసార్లు విన్నాను. అలాంటిది ఏం లేదు. సినిమా కంటెంట్ బట్టి ఉంటుంది” అంటూ కొట్టిపడేశాడు. సరే..మంచిది అనుకుని ఆ విషయాని అప్పుడు వదిలేసినా..ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన చిరంజీవి-చరణ్ నటించిన ఆచార్య..ఫస్ట్ షో తోనే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఎవరో కొందరు సెలబ్రిటీలు..హీట్..డూపర్ అంటున్నా..కానీ అక్కడ సీన్ ఏంటో సినిమా చూసి బయటకు వచ్చిన జనాలు చెప్పేస్తున్నారు.

కొరటాల డైరెక్షన్ ఇంత ఛండాలంగా ఉంటుందా..బాబోయ్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు అయితే..రాజమౌళి ని మధ్య లోకి లాగుతూ..సార్ తో సినిమా చేస్తే ఏ హీరొ ఫేట్ నైన మార్చేస్తాడు. పాపం చరణ్ ఇంకెన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయో అంటూ జాలి పడుతున్నారు. మొత్తానికి ..ఇద్దరు స్టార్స్ ని కళ్లారా చూశాం ఒక్కే తెర పై అని మెగా ఫ్యాన్స్ సంతోషించాలే కానీ..ఆచార్య లో చెప్పుకోవడానికి కాలర్ ఎగరవేయడానికి.. అక్కడ అంత సీన్ లేదు అని తేలిపోయింది. మరి దీని పై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి..?