TJ ప్రీ రివ్యూ : RRR ( రౌద్రం – ర‌ణం – రుధిరం).. ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుందో ?

అబ్బా తెలుగు నాట అంతా త్రిబుల్ ఆర్ మానియా ఊపేస్తోంది. ఎక్క‌డ చూసినా ఎవ‌రి నోట విన్నా ఇప్పుడు త్రిబుల్ ఆర్‌.. త్రిబుల్ ఆర్ ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంద‌ని మూడేళ్లుగా ఎదురు చూశారు. ఇక ఇప్పుడు రేపు ఈ సినిమా వ‌స్తున్నా ఈ కొద్ది గంట‌లు కూడా ఎప్పుడు అవుతాయా ? అని ఒక్క‌టే ఉత్కంఠ‌. అటు టాలీవుడ్‌లోనే ఇద్ద‌రు క్రేజీ హీరోలుగా ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో ఈ సినిమా తెర‌కెక్కింది.

ఇద్ద‌రు క్రేజీ హీరోలు క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్‌.. పైగా తిరుగులేని టాప్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ కాంబినేష‌న్ సెట్ చేయ‌డంతోనే రాజ‌మౌళి స‌గం హిట్ కొట్టేశాడు. మూడున్న‌ర సంవ‌త్స‌రాల టైం.. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం.. జీవిత చ‌రిత్ర పాత్ర‌ల‌ను తీసుకుని రాసుకున్న ఫిక్ష‌న్ స్టోరీ. పైగా ఈ ఇద్ద‌రు వీరులు కూడా విప్ల‌వ కారులే. చ‌రిత్ర‌లో వీరిద్ద‌రు క‌లిసి ఎప్పుడూ ఫైట్ చేయ‌లేదు.

వీరిద్ద‌రు క‌లిసి బ్రిటీష్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తే ఎలా ? ఉంటుంద‌న్న కాల్పినిక క‌థాంశంతో రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఎప్పుడో 13 ఏళ్ల క్రితం త‌న‌కు అడ్వాన్స్ ఇచ్చిన దాన‌య్య కోసం రాజ‌మౌళి ఇప్పుడు వెయిట్ చేస్తూ వ‌చ్చి రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించాడు. బాలీవుడ్‌లో క్రేజ్ కోసం అలియాభ‌ట్‌, బ్రిటీష్ న‌టి ఓవీలియో మోరీస్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రీయా చ‌ర‌ణ్ ఇలా భారీ తారాగ‌ణ‌మే ఉంది.

ఇటు కీర‌వాణి మ్యూజిక్ ఎలాగూ ఉంది. అదిరిపోయే సెట్టింగ్‌లు.. క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్‌.. యాక్ష‌న్ సీన్లు.. ఇవ‌న్నీ ట్రైల‌ర్ చూస్తున్నా.. వాళ్లు చెపుతున్నా మ‌తులు పోయేలా ఉన్నాయి. రేపు మ‌రి ఈ సినిమా ఎన్ని సంచ‌ల‌న రికార్డులు క్రియేట్ చేస్తుందా ? వ‌సూళ్ల ప‌రంగా ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుందో ? చూద్దాం.
చూస్తూనే ఉండండి త్రిబుల్ ఆర్ రివ్యూ కోసం telugujournalist.com