RRR 2వ రోజు వ‌సూళ్లు ఈ అరాచ‌కం ఏంది రా సామీ.. ఊచ‌కోతే..!

ఏదేమైనా చాలా రోజులకు ఇండియ‌న్ సినిమా బాక్సాఫీస్‌నే కాకుండా.. ఓవ‌ర్సీస్‌ను కూడా షేక్ చేసే ఇండియ‌న్ సినిమా వ‌చ్చేసింది. అదే త్రిబుల్ ఆర్‌. అది మ‌న తెలుగు సినిమా కావ‌డం మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణం. మూడు సంవ‌త్స‌రాల‌గా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌.. రెండు, మూడు సార్లు వాయిదాలు ప‌డి ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచ‌నాల‌ను అందుకుంది.

రౌద్రం రణం రుధిరం టైటిల్‌తో వ‌చ్చిన ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్
హీరోలుగా చేస్తే ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి ఈ విజువ‌ల్ వండ‌ర్‌ను డైరెక్ట్ చేశారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజు రు. 250 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో విధ్వంసం క్రియేట్ చేస్తోంది. ఫ‌స్ట్ డే ఏకంగా 5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా రు. 40 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది.

ఇక రెండు రోజుల‌కు ఈ సినిమా అక్క‌డ 7.25 మిలియన్ మార్క్ ని దాటేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా దీనితో ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 50 శాతం రాబట్టేసింది అని అంటున్నారు. అలాగే ఫ‌స్ట్ వీకెండ్‌కే ఈ సినిమా ఏకంగా 10 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేస్తుంద‌ని అంటున్నారు. ఏదేమైనా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త్రిబుల్ ఆర్ ఊచ‌కోత మామూలుగా లేదు.

Share post:

Popular