పాపం ప్రభాస్.. రాధేశ్యామ్ కలెక్షన్స్ చూస్తే షాకే.. పుష్ప అఖండ తో పోలిస్తే..?

ఒకప్పుడు టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా కొనసాగిన ప్రభాస్ ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమా కూడా 100ల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతు ఉండడం గమనార్హం. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ బాహుబలి తర్వాత మాత్రం ప్రభాస్ కి అస్సలు కలిసి రావడం లేదు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన సాహో సినిమా నిరాశపరిచింది. ఇటీవలే హిస్టోరికల్ లవ్ స్టోరీ భారీ అంచనాల మధ్య వచ్చిన రాధేశ్యామ్ ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం లేదు.

రాధేశ్యామ్ కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. రాధేశ్యామ్ సినిమా ఐదు భాషల్లో వచ్చిన.. ఈ సినిమా ఎక్కడ హిట్ టాక్ ను సొంతం చేసుకోలేక పోయింది. భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమాకి ఒక రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అన్ని ఏరియాల్లో 202.80 కోట్ల బిజినెస్ జరిగింది. దీనితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 240 కోట్లు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రాధేశ్యామ్ కలెక్షన్స్ను చూసుకుంటే ఆరు రోజుల్లో దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి అని తెలుస్తోంది. ఆరు రోజుల్లో కలిపి 78.40 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతోపాటు 147.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇక ఆరోజు మాత్రం ఏకంగా 64 లక్షల షేర్ ని మాత్రమే వసూలు చేయడం గమనార్హం. 1.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇదంతా చూస్తుంటే రోజురోజుకు రాధేశ్యామ్ వసూళ్లు ఊహించని రీతిలో పడిపోతున్నాయి అన్నది తెలుస్తుంది.ఇంకా 125 కోట్లు వసూలు వస్తేనే రాధేశ్యాం హిట్టు కిందికి వస్తుంది. కాని ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అది కుదిరేలా కనిపించడం లేదు. రాధేశ్యామ్ కంటే ముందు వచ్చిన అఖండ,పుష్ప సినిమాల కలెక్షన్స్ తో పోల్చి చూస్తే ఈ రెండు సినిమాలు కూడా 11 రోజులకు పైగా ప్రతిరోజు కోటికి పైగా షేర్ వసూలు చేశాయి. భీమ్లా నాయక్ సైతం ఆరు రోజుల వరకు కోటి వరకు షేర్ వసూలు చేసింది. కానీ రాధేశ్యం మాత్రం ఐదు రోజుల వరకే కోటి షేర్ వసూలు చేయగా ఆ రోజు మాత్రం కేవలం 64లక్షల షేర్ మాత్రమే రాబట్టడం గమనార్హం..

Share post:

Popular