తారక్ స్పీడు మామూలుగా లేదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఇందులో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.

కానీ తారక్ మాత్రం తన నెక్ట్స్ సినిమాను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా నాలుగేళ్లపాటు మరే ఇతర సినిమాను కూడా ఒప్పుకోని తారక్, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే వరకు తన నెక్ట్ప్ ప్రాజెక్టును స్టార్ట్ చేసేలా లేడని అందరూ అనుకుంటున్నారు. అయితే తారక్ కూడా తన 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. దీంతో పాటు మరో సినిమాను కూడా తారక్ ప్లాన్ చేస్తున్నాడు.

ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ స్పోర్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు తారక్ సిద్ధమయ్యాడు. కాగా ఈ రెండు ప్రాజెక్టులను ఒకేసారి పట్టాలెక్కించి, రెండింటి షూటింగ్‌లు ఒకేసారి జరుపుకోవాలని తారక్ ప్లాన్ చేస్తున్నాడు. అటు ఈ ఏడాది చివరినాటికి ఈ రెండు సినిమాలను రిలీజ్ చేయాలని కూడా తారక్ భావిస్తున్నాడట. ఇదే నిజమైతే, తారక్ ఈ ఏడాదిలో ఏకంగా మూడు సినిమాలను రిలీజ్ చేసినట్లు అవుతుంది. మరి నిజంగానే తారక్ తన ప్లాన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేస్తాడా లేడా అనేది తెలియాలంటే ఈ ఏడాది చివరినాటికి ఆగాల్సిందే.

Share post:

Popular