‘మాచర్ల నియోజకవర్గం’ మాస్‌తో నితిన్ అరాచకం!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో నితిన్ పాత్ర సరికొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

కాగా తాజాగా నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ అటాక్ టీజర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియో టీజర్‌లో నితిన్‌ను మునుపెన్నడూ చూడని విధంగా అల్ట్రా మాస్ లుక్స్‌తో మనకు చూపించారు. ఆయన ఇంటెన్స్ లుక్స్ ఈ టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా ఈ టీజర్‌ను కట్ చేసినట్లు మనకు తెలుస్తోంది.

పులివేషంలో ఉన్న రౌడీలను ఛేజ్ చేస్తూ నితిన్ ఎలివేషన్, దానికి తగ్గట్టుగా వచ్చిన బీజీఎం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాయి. ఇక ఈ సినిమాలో నితిన్ ఓ పవర్‌ఫుల్ ఐఏఎస్ పాత్రలో కనిపిస్తున్నాడు. తన హోమ్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ఉప్పెన ఫేం బ్యూటీ కృతి శెట్టి, కేథరిన్ త్రేసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ‘మాచర్ల నియోజకవర్గం’లో నితిన్ విజయాన్ని అందుకుంటాడా లేడా అనేది తెలియాలంటే జూలై 8 వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest