రేటు పెంచేసిన థ‌మ‌న్‌… వామ్మో కొత్త రేటు షాకిస్తోందిగా…!

ప్రముఖ సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇటీవల ఈయన క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి. ఇక ఈయన సంగీత దర్శకత్వం వహించిన అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం కోట్ల రూపాయలను వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

అంతే కాదు పెద్ద నిర్మాతలకు సైతం కలెక్షన్లు చూసి కొంతవరకు ఊరట కలిగిందని చెప్పవచ్చు. ఈ సినిమా తరువాత అంతే స్థాయిలో భీమ్లా నాయక్ సినిమా కూడా కలెక్షన్లు సాధించడం గమనార్హం.సాగర్ కే చంద్ర అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా కూడా టికెట్లు రేట్లు తగ్గించినా కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డు స్థాయిలో సాధించింది. ఇక ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన థమన్ విశేష ఆదరణ పొందాడు.

సాధారణంగా ఎవరైనా సరే ఇండస్ట్రీలో విజయాన్ని అందుకున్నారు అంటే డిమాండ్ చేయడం మొదలుపెడతారు. సంగీత దర్శకుడు థమన్ ఒకే సారి రెండు బ్లాక్ బాస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకోవడం తో మరింత డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దేవిశ్రీ ప్రసాద్ ను మించి థమన్ టైం మొదలైంది అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ప్రతి ఒక్క సినిమాకి ప్రాణం పెట్టి పని చేస్తుండడంతో సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి అందుకే ఆయన ఒక్కో సినిమాకు ఏకంగా రూ.2.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

నిజానికి ఎప్పుడో థమన్ పారితోషికం ను డిమాండ్ చేయవలసి ఉంది కానీ పరిస్థితుల రీత్యా డిమాండ్ చేయలేకపోయాడు. ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడంతో అందుకే ఆయన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం . ఆయన అడిగిన అంతా పుచ్చుకోవడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Popular