మహేష్ కోసం అంత బడ్జెట్.. ఏం చూసుకుని ఇంత ధైర్యం..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో బాహుబలి చిత్రంతో ప్రూవ్ అయ్యింది. ఇక తాజాగా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా రికార్డుల పరంగా కూడా కొత్త వండర్స్ క్రియేట్ చేస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో ఇప్పుడు అందరి చూపులు జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పడింది. గతంలోనే స్టార్ హీరో మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నట్లు జక్కన్న చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ అడవి నేపథ్యంలో సాగుతుందని చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం ఏకంగా రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

అయితే మహేష్ సినిమా కోసం ఇంతటి భారీ బడ్జెట్‌ను కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఓ సందేహం నెలకొంది. మహేష్‌కు ఇప్పటివరకు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు రాలేదు. మరి ఇలాంటి సమయంలో ఇంతటి భారీ బడ్జెట్‌తో సినిమా చేస్తే, అది పాన్ ఇండియా ఆడియెన్స్‌ను మెప్పిస్తుందా లేదా అనే డౌట్ తలెత్తుతోంది. ఏదేమైనా మహేష్ సినిమా కోసం ఇంతటి భారీ బడ్జెట్‌ను కేటాయించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Share post:

Popular