ఎన్టీఆర్ డ్యాన్స్ ముందు తేలిపోయిన చరణ్ స్టెప్పులు..తొక్కిపారదొబ్బాడుగా ..!!

కోట్లాది మంది అభిమానులతో పాటు బడా బడా స్టార్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు “ఆర్ ఆర్ ఆర్” సినిమా కోసం. బాహుబలిలాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ ని తెరకెక్కించిన రాజమౌళి ..ఆ తరువాత ఈ సినిమా ను తెరకెక్కిస్తుండడంతో అభిమానుల అంచనాలు డబుల్ అయ్యాయి. దానికి తగ్గట్లే అభిమానులు కలలో కూడా ఊహించని కాంబినేషన్ ని సెట్ చేసి..టాలీవుడ్ లో కొత్త ఆశలు రేపారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయిన చరణ్-తారక్ ని పెట్టి భారీ మల్టీస్టారర్ సినిమా తీయ్యడం చాలా చిక్కులతో కూడుకున్న పని. వాళ్లను సాటిస్ఫై చేయడం అటుంచితే..ఇద్దరి హీరోల్లో ఏ ఒక్కరిని తక్కువ చేసి అభిమానులు పట్ట పగలే చుక్కలు చూయిస్తారు..అలా ఉంటాది వ్యవహారం.

ఎట్టకేలకు రాజమౌళి దాదాపు నాలుగేళ్ళు కష్టపడి .. ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది కానీ సక్సెస్ నా ఫెయిల్యూర్ నా అని మరికొన్ని రోజుల్లో తెలియనుంది. కాగా, సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా.. RR టీం ఈ మధ్యనే “ఎత్తర జెండా” అనే సాంగ్ ను రిలీజ్ చేసింది. దేశభక్తిని చాటే ఈ పాట లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఈ పాటలో చరణ్, తారక్, ఆలియా వేసుకున్న కాస్ట్యూమ్‌స్..నటించిన తీరు..ఎక్స్ ప్రేషన్స్ , డ్యాన్స్ పై అభిమానులు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. యూట్యూబ్ లో ఈ పాట సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. అయితే, ఈ పాటలో అందరికంటే ఎక్కువుగా అందరికి బాగా నచ్చింది ఎన్టీఆర్ డ్యాన్స్ అంటున్నారు అభిమానులు. వాళ్ళే కాదు చూసే జనాలాకు కూడా అర్ధమైపోతుంది. పాటలో అంత మంది ఉన్నా..అందరి కళ్లు ఎన్టీఆర్ వైపే చూస్తున్నాయి. అంతలా ఆయన పర్ ఫామెన్స్ ఆకట్టుకుంది జనాలను. చరణ్ కూడా బాగానే చేశాడు. కానీ ఎన్టీఆర్ బాగా చేశాడు అంటున్నారు అభిమానులు. డ్యాన్స్ అంటే ఏదో కొరియోగ్రాఫర్ ఇచ్చిన స్టెప్పులను పదిసార్లు ప్రాక్టీస్ చేసి దింపేయకుండా..ఎంజాయ్ చేస్తూ చేశారు ఎన్టీఆర్ అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి పొగిడేస్తున్నారు. మరికొందరు అయితే.. మా ఎన్టీఆర్ డ్యాన్స్ ముందు చరణ్ స్టెప్స్ తేలిపోయాయి..ఎన్టీఆర్ కు రాలేరు ఎవరు పోటీ అంటూ పాట పై రీవ్యూ ఇస్తున్నారు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Popular