ప్రియుడు కోరాడని ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వారు కోరితో కొండ మీద కోతినైనా తెచ్చేందుకు వెనకాడరు. అలాంటిది తనకు ఎంతో ఇష్టమైన ప్రేమికుడు కోరాడని ఓ ప్రేయసి చేసిన పని గురించి తెలుసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని దూషించకమానరు. ఇంతకీ ఆ ప్రేమికుడు ఏం కోరాడు.. ఆ ప్రేయసి ఏం చేసిందో తెలియాలంటే వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

వెస్ట్ బెంగాల్‌లోని నార్త్ 24 పర్గానాస్ జిల్లా బషీర్ హట్ సబ్ డివిజన్‌కు చెందిన ఓ యువతి, కొన్నేళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఆమె అతడి ప్రేమలో పీకల్లోతూ మునిగిపోయింది. దీంతో అతడు ఏం కావాలన్నా ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ ప్రేమికుడు తన ప్రేయసికి చెల్లి వరుస అయ్యే అమ్మాయిపై కన్నేశాడు. దీంతో ఆమెను తనవద్దకు పంపాలని తన ప్రేయసిని కోరాడు.

అయితే ప్రేమ మైకంలో ఆ యువతి తన ప్రేమికుడు కోరిన విధంగా తన చెల్లిని అతడి వద్దకు ఒంటరిగా తీసుకెళ్లింది. వారిద్దరినీ ఒక గదిలో పెట్టి బయటనుండి తాళం వేసింది. ఈ క్రమంలో ఆ కామాంధుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్భయ ఘటన కన్నా దారుణంగా ఆమెపై అత్యాచారానికి పూనుకున్నాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తరువాత అక్కడి నుండా సదరు ప్రేయసి తన ప్రేమికుడితో వెళ్లిపోయారు. తమ కూతురు ఎంతకీ కనిపించకపోవడంతో ఆ యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

తమ బాలికను తీసుకెళ్లిన యువతి ఇంట్లో ఆమె నగ్నంగా, అపస్మారక స్థితిలో కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసు కేసు నమోదు చేశారు. చెల్లి వరస అయ్యే అమ్మాయిపై ఇంతటి దారుణానానికి పాల్పడిన బాలిక అక్క, ఆమె ప్రియుడిను పోలీసులు అరెస్ట్ చేశారు.

Share post:

Latest