ఎన్టీఆర్ కంప్యూటర్ అయితే, చరణ్ వైట్ పేపర్..ఏందయ్య రాజమౌళి ఇది..?

అందరు జక్కన్న ని చాలా తెలివైనవాడు ..తెలివితేటలు ఉన్నవాడు అంటుంటారు. కానీ ఎంత తెలివిగల వాడైన కొన్ని సార్లు పప్పులో కాళ్ళు వేయ్యాల్సిందే..నెటిజన్స్ చేత ట్రోల్ అవ్వాల్సిందే. అందుకు దర్శక ధీరుడు మినహాయింపు కాదు. బాహుబలి లాంటి సిరీస్ తీసి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి అంటే ఇండస్ట్రీలో బడా బడా హీరోస్ కి కూడా గౌరవం.

సాహసాలు చేయడం అంటే రాజమౌళికి ఇష్టం అనుకుంటా..అందుకే అస్సలు ఎవ్వరు ఊహించని విధంగా కని విని ఎరుగని రీతీలో ఇద్దరు బడా హీరో ని పెట్టి సినిమా ను తెరకెక్కించాడు. అందులో ఆ ఇద్దరు టాలీవుడ్ లో ఉన్న బిగ్ ఫ్యామిలీ వారసులు కావడం మరో విశేషం. రాజమౌళి డైరెక్షన్ లో..చరణ్-తారక్ కలిసి మల్టీ స్టారర్ గా నటిస్తున్న చిత్రం “RRR”. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ..మార్చి 25 న విడుదల అవ్వడానికి రెడీ అయ్యింది. ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోను తప్పించుకునే ఛాన్స్ నే లేదు. రిలీజ్ అవ్వాల్సిందే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే అన్నట్లు కాచుకుని కూర్చున్నారు అభిమానులు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి పలు ఇంటర్వ్యులు ఇస్తూ బిజీ గా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యుల్లో ఆయన మాట్లాడుతూ.చరణ్ ని వైట్ పాపర్ అని..ఎన్టీఆర్ ని కంప్యూటర్ అని పోలుస్తూ తనదైన స్టైల్ లో వివరణ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ..”రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా తీయ్యకముందు నుండే మంచి ఫ్రెండ్స్. ఇక వాళ్లతో నా వారి వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందంటే.. ఎన్టీఆర్ ని చూసినప్పుడల్లా నాకు ఒక కంప్యూటర్ లా అనిపిస్తాడు. ఎందుకంటే.. మాలులు గ్రాస్పింగ్ పవర్ కాదు. మనం ఏదైన చెప్పితే చాలు దాని టక్కున పట్టేస్తాడు. మనకు కావాల్సిన విధంగా నటించేసి..రెండోసారి చెప్పించే పనిలేకుండా చేస్తాడు. అంతేకాదు ఒకటి చెప్పిన చాలు వెంటనే రెండోది పట్టెస్తాడు.

అదే చరణ్ విషయానికి వస్తే.. మాత్రం నాకు ఓ వైట్ పాపర్ లా అనిపిస్తాడు. ఆ కాగితంలో మనం అద్భుతం రాస్తే మహాద్భుతం చేస్తాడు. ఎందుకంటే..మనం ఏదైన సీన్ , డైలాగ్ చెప్పిన తర్వాత చాలా సేపు ఆలోచిస్తాడు. దాని కోసం బాగా కసరత్తులు చేసి..ఫైనల్ ఓఉట్ పుట్ పర్ ఫెక్ట్ లా ఉండేలా చూసుకుంటాడు” అని చెప్పుకొచ్చారు రాజమౌళి. అయితే దీని పై మెగా ఫ్యాన్స్ రాజమౌళి పై మాటల యుద్ధం స్టార్ట్ చేశారు. మా హీరో ని తక్కువుగా చేసి మాట్లాడుతున్నావు అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సినిమా విడుదల అయ్యాక ఎలా ఉంటూందో రాజమౌళి పరిస్ధితి అంటూన్నా