చరణ్ కి రాజమౌళి సజీషన్..ఇదేంటి ఇలా అనేశాడు..?

రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటమి ఎరుగని దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు నెలకోల్పాడు. ఓ మగధీర్, ఓ బాహుబలి, ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్..ఇలా మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు. చరణ్-తారక్ లను పెట్టి సినిమా తీయ్యాలి అనే ఆలోచన రావడమే గ్రేట్..కానీ పెద్ద తలనొప్పులతో కూడుకున్న వ్యవహారం.

కానీ, అసాధ్యాని..సుసాధ్యం చేసి చూపించాడు జక్కన్న. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న సినిమా “RRR”. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ రాజమౌళి ఆ అంచనాలను మించిపోతాడు అందులో డౌట్ లేదు. అన్ని కలిసి వచ్చుంటే ఎప్పుడో ఈ సినిమా రిలీజై..సినీ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అయ్యింది.

ఇక ఫైనల్ గా మార్చి 25న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడ్ అయ్యారు. చిత్ర ప్రమోషన్స్ అయితే రాజమౌళి ఓ రేంజ్ లో చేస్తున్నాడు. భిన్న విభిన్నంగా ఏ డైరెక్టర్ చేయనటువంటి రీతిలో చేస్తున్నారు. ఈ క్రమంలో నే రీసెంట్ గా రెగ్యులర్‌ ఇంటర్వ్యూ మాదిరిగా కాకుండా చాలా సరదాగా, ఫన్నీగా.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి ముగ్గురు కలిసి ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మాటల సంధర్భంలో చరణ్.. ‘నాకు నిద్రొస్తుంది.. కాపీ పెడతాను. మీకు ఏమైనా కావాలా’ అని రాజమౌళిని, తారక్ ని అడగ్గా.. తారక్ రిప్లై ఇస్తూ తనదైన స్టైల్ లో ” చరణ్..నువ్వు పెడితే విషం కూడా తాగేస్తా’ అంటూ ఫన్నీగా ఆన్సర్ చేశాడు. కరెక్ట్ గా అదే టైంలో రాజమౌళి ఎంటర్‌ అయ్యి.. అయితే “అతడికి రెండు చుక్కల విషం కలిపి ఇచ్చెయ్‌ చరణ్” అంటూ కౌంటర్‌ పంచ్ వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Share post:

Latest