ఆ బంధం నుండి తప్పుకుంటున్నా..అనుష్క శర్మ సంచలన నిర్ణయం..!!

అనుష్క శర్మ.. పేరుకి పరిచయం అవసరం లేదు. తన నటనతో అందంతో కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టింది. ఒకానోక టైంలో బడా బడా హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసి బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చలామణీ అయ్యింది. అంతేనా సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతూ స్టార్ హీరోతో సమానంగా పారితోషకాని పుచ్చుకున్ని లెజండ్స్ హీరోని సైతం ఆశ్చర్య పరిచింది. ఎటువంటి క్యారెక్టర్లోనైన ఆమె దూరి పోయి నటించగలదు.

షారు ఖాన్ తో నటించిన “RAB NE BANADI JODI” లో ఆమె యాక్టింగ్ కు అందరు ఫిదా అయ్యారు. ఆ వెంటనే మరో మూవీ “PARI” లో నెగిటివ్ ఎనర్జీ పాత్రల్లో అందరిని భయపెట్టేసింది. ఇలా సినిమా సినిమాకి వేరియేషన్స్ చూయిస్తూ వచ్చిన ఈ నటి..ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. దాదాపు వన్ ఇయర్ వరకు పాప ఫేస్ ని బయటప్రపంచానికి చూపించకుండా దాస్తూ వచ్చిన ఈ జంట..రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో అనుకోకుండా పాప ఫేస్ ని రివీల్ చేశారు. ఇది అప్పట్లో పెద్ద వైరల్ గా మారింది.

అయితే అనుష్క నటనతో పాటు నిర్మాణ రంగలో కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అనుష్క సుమారు పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు తన సోదరుడు కర్నేష్‌తో ‘క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ ‘ అనే బ్యానర్‌ స్థాపించింది. ఈ బ్యానర్‌‌పై పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించారు. కాగా రీసెంట్ గా ఈ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించించింది. ఓ నటిగా , ఓ మదర్ గా తన బాధ్యతలను నిర్వర్తించడానికి .. ‘క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ ‘ అనే బంధం నుండి తప్పుకుంటున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. కొత్త రంగంలో కొత్త జీవితంలో అడుగు పెట్టే ఆలోచనతో నిర్మాణ సంస్థ నుండి వైదొలిగాలనే నిర్ణయం తీసుకున్నా..నా పూర్తి జీవితాని నా ఫస్ట్ లవ్ నటించడం పైనే పెట్టబోతున్నా అని అనుష్క శర్మ తన పోస్టులో రాసుకొచ్చింది.

Share post:

Latest