టాలీవుడ్ స్టార్ హీరోలకు హెచ్చరిక పంపిస్తున్న రవి తేజ !

రవి తేజ కెరీర్ ఇప్పుడు స్టార్ హీరోలకు ఒక హెచ్చరికలాగా మారింది .సైలెంట్గా రవి తేజ ఇండస్ట్రీలో ఇప్పుడు దూసుకుపోతున్నాడు .ఒకప్పుడు కోలీవుడ్లో రజినీకాంత్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు రవి తేజ ఫాలో అవుతున్నాడు .రవి తేజ రెమ్యూనరేషన్ కూడా ఆమాంతం పెరిగింది .ఒకసారి రవి తేజ అడుగులు గమనిస్తే అతడు ఎత్తు తెలుస్తుంది .మాస్ మహారాజ్ రవి తేజ క్రాక్ సినిమా ముందు వరకు హిట్ కోసం ఎంతగానో ఎదురుచూశాడు .గోపీచంద్ మలినేనితో ఇంతకముందు డాన్ శ్రీను ,బలుపు సినిమాలు చేసిన రవితేజ హ్యాట్రిక్ మూవీ గా క్రాక్ సినిమా చేసాడు .ఆ సినిమా మాస్ మహారాజ్ రవి తేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది .ఆ ఉత్సాహంతోనే రవితేజ మళ్లీ వరస సినిమాలతో దూసుకుని వెళుతున్నాడు .

రవి తేజ, రమేష్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ఖిలాడీ రిలీజ్ కి రెడీగా ఉన్నది .ఫిబ్రవరి 11 న ఈ సినిమా ఫిక్స్ చేసుకున్నారు .ఈ సినిమా కోసం రవి తేజ దాదాపు పండెండు నుండి పదిహేను కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని టాక్ .ఇక శరత్ మండవ డైరెక్షన్లో వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ కూడా షూటింగ్ కూడా చివరి దశ లో ఉన్నది .ఈ సినిమా కోసం రవి తేజ కేవలం 50 రోజులు డేట్లు మాత్రమే ఇచ్చారట .ఆ సినిమా కూడా 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట .

ఇక సుదీర్ వర్మ డైరెక్షన్లో వస్తున్న రావణాసురుడు కూడా షూటింగ్లో ఉన్నది ,ఇదేకాకుండా నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో ధమాకా కూడా చేస్తున్నాడు .కె ఎస్ రవీంద్ర తో మెగా స్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాలో కూడా రవి తేజ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని టాక్ .ఈ పాత్ర కోసం రవి తేజ ఎనిమిది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట .ఏలలేదన్న ఈ 5 మరియు 6 సినిమాలకు రెమ్యూనేషన్ 15 కోట్లు సెట్ చేసున్నాడట .క్రాక్ హిట్ తో రవి తేజ మళ్లీ ఫామ్లోకి వచ్చాడని అభిమానులు హ్యాపీగా ఉన్నారట .కనీసం ఇందులో రెండు సినిమాలు హిట్ అయితే రవి తేజాన్ని పట్టుకోవటం కష్టమే అంటున్నారు జనాలు .చూద్దాం ఏమి జరిగిదో .

Share post:

Latest