బడా డైరెక్టర్ కి సారీ చెప్పిన మహేష్ బాబు..అంత తప్పు ఏం చేశావయ్యా..?

టాలీవుడ్ లో కి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరస్దాయి గా నిలిచిపోతారు. అలాంటి వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పేరు చేప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడేకానీ ఏ రోజు కూడా ఆయన రికమండేషన్ లతో సినిమా అవకాశాలు అందుకోలేదు. ఇక కృష్ణ కూడా ఇలా నటించాలి అని గైడ్ చేశాడు కానీ మా కొడుకు కి అవకాశాలు ఇవ్వండి అంటూ చెప్పలేదు. మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి అనే విషయాని గట్టిగా నమ్ముతారు ఈ ఘట్టమనేని వారసుడు.

ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పరశురాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న ఈయన..ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుందట. అయితే మొన్న ఆ మధ్య కరోనా బారిన పడిన మహేష్ బాబు..పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుని సేఫ్ జోన్ లోకి వచ్చాడు. దీంతో ఫ్యామిలీతో టైం స్పెంట్ చేయడానికి మహేష్ డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్ కు వెళ్ళారట. మొదటి నుండి మహేష్ బాబు ఎక్కువ టైం కుటుంబంతో గడపడానికే ఇష్టపడతారు అన్న సంగతి తెలిసిందే.

ఇక ఆ రెస్టారెంట్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు చూసి ఇద్దరు అమ్మాయిలు సార్..ఫోటో ప్లీజ్ అని అడిగారట. దీంతో మహేష్ బాబు నేను నా ఫ్యామిలీ తో ఉన్నాను. ఇది కరెక్ట్ టైం కాదు.. అంటూ సున్నితంగా వాళ్ళను పంపించేశారట. ఇక పక్కనే ఉన్న వాళ్ళు సార్ వాళ్ళు ఎవరో తెలుసా.. స్టార్ డైరెక్టర్ శంకర్ డాటర్స్ అంటూ చెప్పారట. దీంతో షాకైన మహేష్..వెంటనే శంకర్ కు ఫోన్ చేసి సారీ సార్ మీ డాటర్స్ అని తెలియదు అంటూ తెలిపారట. ఇక దీని పై నెటిజన్స్ శంకర్ కూతుళ్లు ఇంత సింపుల్ గా ఉంటారా గ్రేట్ అంటుంటే..మరికొందరు..ఇందులో మహేష్ తప్పేముంది ..ఆయన చేసింది కరెక్ట్ నే గా..ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎవ్వరికైన ప్రైవసీ ఇవ్వాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Latest