Son of India: మోహన్ బాబు సినిమా హిట్టా-ఫట్టా..?

టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీదనే చెప్పడం ఆయన అలవాటు. అందుకే కాబోలు ఆయన అంటే ఇండస్ట్రీలో చాలా మందికి భయం..ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు కూడా. ఒకప్పుడు హీరో గా నటించిన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఈయన ఈ మధ్య తెర పై కనిపించి చాలా ఏళ్ళు అవుతుంది. దానికి రీజన్ లేకపోనూ లేదు.. పాలిటిక్స్ లో కి ఎంటర్ అయ్యాక ఆయన సినిమాల పై కాన్సెన్ట్రేషన్ తగ్గించేసారు అని చాలా మంది అనుకున్నారు. ఏవో అడపాదడపా చిన్న పాత్రల్లో కనిపించారే కానీ మెయిన్ హీరో గా సినిమాలు చేసి చాలా కాలం అవుతుంది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ల తరువాత మెయిన్ లీడ్ హీరోగా “సన్ ఆఫ్ ఇండియా” అనే మూవీతో మనముందుకు వచ్చాడు మోహన్ బాబు.

చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..సింగిల్ గా నటించిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఆయ‌నే స్క్రీన్ ప్లేను అందించారు. ఇప్పతీకే రిలీజ్ అయిన సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌ను బట్టి .. ఈ సినిమా రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మ‌ని ముందే అందరికి అర్ధమైపోయింది. ఇక నేడు ఈ సినిమాను చూసిన వారు కూడా అదే రివ్యూ ఇస్తున్నారు. మోహన్ బాబు నేటి రాజ‌కీయ ప‌రిస్థితుల అనుగుణంగా తెరకెక్కించిన క‌థే ఈ స‌న్ ఆఫ్ ఇండియా అని చెప్పుకొస్తున్నారు.

మ‌రి పూర్తి సినిమా ఎలా ఉంది అన్న ప్రశ్నకు సినిమా చూసిన జనాలు.. కొంతమంది మోహన్ బాబు బాబు నటన తప్పిస్తే ఈ సినిమా లో మరేమి చెప్పుకొతగ్గ అంశాలు లేవు అంటున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని సినిమాల్లో లాగానే ఇది కూడా రీవేంజ్ డ్రామా సినిమా అంతే. ఒక్కముక్కలో చెప్పుకోవాలంటే సినిమా మొత్తానికి మోహన్ బాబు ఒక్కడే కనిపిస్తారు. ఓవర్ ఆల్ గా సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు వాళ్ళ మాటలను బట్టి అర్ధమౌతుంది. నిజానికి మోహన్ బాబు ఈ సినిమాను ఓటిటిలో రిలీజ్ చేయడానికే తెరకెక్కించారట. కానీ లాస్ట్ మినిట్ లో సీన్ మార్చి ధియేటర్స్ లో రిలీజ్ చేసారు. అది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయ్యింది. పైగా సినిమా నిడివి కేవలం 1 గంట 42 నిమిషాలే కావడంతో ధియేటర్స్ కు వచ్చిన జనాలకు విసుకు వచ్చిన్నట్లు అర్ధమౌతుంది. కాకపోతే కొన్ని పొలిటికల్ పంచులతో కాసేపు నవ్విస్తాడట మోహన్ బాబు. ఇక ఫైనల్ గా గత కొంత కాలంగా హిట్టే లేని మంచు ఫ్యామిలీకి ఈ సినిమా కూడా నిరాశే మిగిల్చింది అంటున్నారు నెటిజన్స్.