రోడ్డుపై షూటింగ్.. హీరోయిన్ కు పిచ్చి అనుకున్న జనాలు.. చివరికి?

నేటి రోజుల్లో ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంది అంటే హడావిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవుట్ డోర్ లో షూటింగ్ జరుగుతుంది అంటే చాలు చుట్టుపక్కల ఉన్న జనాలందరూ అక్కడ గుమిగూడి సినిమా యాక్టర్ ల ను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.. ఇలా అవుట్ డోర్ షూటింగ్ లో కి వెళ్ళినప్పుడు మరింత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఒకప్పుడు అలా కాదు ఎవరైనా అవుట్ డోర్ సినిమా షూటింగ్ తీస్తున్నారు అంటే జనాలు అంతగా పట్టించుకోక పోయేవారట. సినిమాలు ప్రారంభమైన 40వ దశకంలో ఇలా జరిగిందట.

అప్పట్లో సినిమా షూటింగులు జరుగుతున్నాయని ఎవరికి తెలియక పోవడంతో చూసీచూడనట్లు గానే వ్యవహరించారట. అంతే కాదు నటీనటులు ఔట్డోర్ షూటింగ్ లలో నటిస్తున్నప్పుడు వాళ్ళని పిచ్చి వాళ్ళ చూడటం కూడా చేసేవారట. 1938లో తెరకెక్కిన గృహలక్ష్మి అనే సినిమా సమయంలో కూడా ఇలాంటిదే ఒక ఘటన జరిగిందని తెలుస్తోంది. హీరోయిన్ నటనలో విలీనమైతే చుట్టుపక్కల ఉన్న జనాలు పిచ్చిది అని ఏకంగా పట్టుకున్నారట.

ఇంతకీ ఏం జరిగిందంటే హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో రోహిణి పిక్చర్స్ బ్యానర్ పై 1938లో మహాలక్ష్మి అనే సినిమాని తెరకెక్కించారు. ఇక ఇందులో హీరోయిన్గా నటిస్తుంది కన్నాంబ. ఇక సినిమా చివర్లో హీరోయిన్ పిచ్చిది అయిపోతుంది. దేవుడి మీద నమ్మకం లేదు దేవుడు పూర్తిగా అన్యాయం చేశాడు అంటూ రోడ్డుపై పరిగెడుతుంది. ఈ సీన్ షూటింగ్ సమయంలో ఎక్కడో ఒక మూలన కెమెరా పెట్టాడట దర్శకుడు. రోడ్డుపై ఉన్న మనుషులందరినీ తోసుకుంటూ ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకుంటూ రోడ్డుపై పరిగెత్తు ఉందట కన్నాంబ. ఈ క్రమంలోనే పిచ్చిది అనుకుని ఏకంగా అక్కడున్న వారందరూ హీరోయిన్ ను పట్టుకొని ఒక దగ్గర కూర్చో పెట్టారట. ఆ తర్వాత షాక్ అయిన దర్శక నిర్మాతలు ఇది సినిమా షూటింగ్ ని పూర్తి వివరణ ఇచ్చేంత వరకు కూడా హీరోయిన్ ని వదిలి పెట్టలేదు అక్కడ జనాలు.