ఆపరేషన్ పక్కనపెట్టి.. డాన్స్ కొరియోగ్రఫీ చేసాడు.. ఆయన డెడికేషన్ కు హాట్సాఫ్?

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలోని ప్రతీ పాత్ర హైలెట్గా నిలిచింది. అదే రేంజ్ లో ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కూడా ఊహించని రేంజ్ లో హిట్ అయ్యింది. అటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఊహించి ఉండడు.. ఊ అంటావా పాట ఇంత సక్సెస్ అవుతుందని. కేవలం ఒక భాషలో కాదు ఐదు భాషల్లో కూడా ఈ పాట రికార్డులు సృష్టించింది అని చెప్పాలి. ఐటెం సాంగ్ లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నడిపించడం.. మత్తెక్కించే చూపుల తో ప్రేక్షకులను అలరించడం ఎంతగానో ప్లస్ పాయింట్ గా మారిపోయింది.

కాగా ఈ పాటలో చేసిన డాన్స్ కూడా అందరిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. అయితే ఇక ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య డాన్స్ సమకూర్చాడు. ఇటీవలె ఊ అంటావా ఉహూ అంటావా పాటకు సంబంధించిన కొరియోగ్రఫీ గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య. డిసెంబర్ 17 వ తేదీన రిలీజ్.. డిసెంబర్ 3వ తేదీన అల్లుఅర్జున్ నాకు కాల్ చేసి ఒక పాటకు కొరియోగ్రఫీ చేయాలి అన్నాడు.. ఇంత తక్కువ టైంలో చెబితే ఎలా నాకు రేపు కంటి సర్జరీ కూడా ఉంది అంటూ చెప్పాను. కానీ పుష్ప నిర్మాతలు మాత్రం అసలు వినలేదు. నాతోపాటు డాక్టర్ తో కూడా మాట్లాడి సర్జరీ డేట్ వాయిదా వేయించారు.

ఆ తర్వాత కొరియోగ్రఫీ చేయడానికి పిలిపించుకున్నారు. ఊ అంటావా ఉహూ అంటావా పాట విన్న తర్వాత మాత్రం అందులో ఎలాంటి వల్గారిటీ లేకుండా డాన్స్ కంపొస్ చేయాలి అని అనుకున్నాను. ఈ క్రమంలోనే తనదైన స్టైల్లో సెన్సువాలిటీ తీసుకువచ్చి డాన్స్ కంపోజ్ చేసాను. ఇక సాంగ్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ మెచ్చుకున్నారు. నాకు సాంగ్ లో ఎక్స్పోజింగ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. స్త్రీల ఆటిట్యూడ్ చాలు ఎక్స్పోజింగ్ అవసరం లేదు. అదే ఊ అంటావా సాంగ్ లో చూపించడానికి ప్రయత్నించాను అంటూ గణేష్ ఆచార్య చెప్పుకొచ్చారు. ఇక ఈ సాంగ్ హిట్ అవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపాడు గణేష్ ఆచార్య.