జూనియ‌ర్ మీద క‌సి పెంచుకుంటే.. మ‌న‌కే న‌ష్టం బ్రో…?

ఔను! ఈ మాట మ‌రోసారి టీడీపీలో జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే.. తాజాగా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, స‌హా.. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌లు మ‌రోసారి జూనియ‌ర్ ఎన్టీఆర్ ను కార్న‌ర్ చేశారు. ఆయ‌న వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. 2014, 2019లో అస‌లు జూనియ‌ర్ ఏమ‌య్యాడ‌ని ప్ర‌శ్నించారు. తాజాగా ఒక ఆన్‌లైన్ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బొండా ఉమా తీవ్ర‌వ్యాఖ్య‌లే చేశారు. జూనియ‌ర్‌ను అడ్డు పెట్టుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వంశీ, మంత్రి కొడాలి నాని.. ఈ రోజు టీడీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు.

అక్క‌డితో బొండా ఆగ‌కుండా.. దీనివెనుక‌ జూనియ‌ర్ ఉన్నాడ‌ని.. ఆయ‌న ప్రోద్బ‌లంతోనే వీరు ఇలా చేస్తున్నార‌ని వ్యాఖ్యానిం చారు. అంతేకాదు.. చంద్ర‌బాబును నిండు స‌భ‌లో వైసీపీ నాయ‌కులు అవ‌మానించిన‌ప్పుడు.. కూడా జూనియ‌ర్ స‌రిగా స్పందించ లేద‌ని.. బొండా చెప్పారు. నిజానికి క‌త్తి తీసుకునో.. క‌ర్ర తీసుకునో.. వారి వెంట‌ప‌డ‌తాడ‌నిజూనియ‌ర్‌పై తాము అనుకున్నామ‌ని.. కానీ, ఆయ‌న స్పంద‌న చాలా చ‌ప్ప‌గా ఉంద‌ని.. ఇలాంటివారితో.. త‌మ నాయ‌కుడు, యువ నేత‌.. లోకేష్‌ను ఎందుకు పోలుస్తున్నార‌ని.. లోకేష్ చాలా యాక్టివ్ఃగా ఉన్నార‌ని.. సో.. జూనియ‌ర్‌కు ఆయ‌న‌కు మ‌ధ్య పోలికే లేద‌ని.. బొండా వ్యాఖ్యానించారు.

ఇక‌, మాజీ ఎమ్మెల్సీ వెంక‌న్న కూడా జూనియ‌ర్ వ‌ల్లే కొంద‌రు త‌మ‌పై దాడులు చేస్తున్నార‌ని.. ఆయ‌న ఏమీ అన‌డులే అని రెచ్చిపోతున్నార‌ని. అస‌లు జూనియ‌ర్ మాట త‌లుచుకుంటేనే త‌మ న‌రాలు పొంగిపోతున్నాయ‌ని అన్నారు. ఇలా .. ఇద్ద‌రు నేత‌లు కూడా .. ఒక రోజు వ్య‌వ‌ధిలో జూనియ‌ర్‌ను టార్గెట్ చేయ‌డంతో.. పార్టీలోనే ఒక ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీద‌కి వ‌చ్చింది. జూనియ‌ర్‌ను కెలుక్కుంటే.. మొత్తానికే మోసం త‌ప్ప‌ద‌ని.. విశాఖ‌కు చెందిన మాజీ మంత్రి ఒక‌రు ఇద్ద‌రికీ ఫోన్ చేసి హెచ్చ‌రించినట్టు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన డ్యామేజీ జ‌రిపోయింద‌ని.. జూనియ‌ర్ వ‌ల్ల యూత్ అంతా.. మ‌న‌కు అండ‌గా ఉన్నార‌ని.. ఇప్పుడు ఇంకా టార్గెట్ చేయ‌డం స‌రికాద‌ని.. ఆయ‌న చెప్పిన‌ట్ట పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్‌తో చ‌ర్చ‌ల‌కు రావాల్సిన జూనియ‌ర్‌.. మ‌న‌కోస‌మే ఆగిపోయార‌నే విష‌యాన్ని గుర్తించాల‌ని కూడా ఆయ‌న చెప్పిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ కోసం.. ఇక పై ఆయ‌న గురించి ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని కూడా మాజీ మంత్రి సూచించార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Share post:

Latest