ఆ రాత్రి చై-సామ్ ల మధ్య ఇంత జరిగిందా..నాగార్జున చేసింది ముమ్మాటికి తప్పే..?

గత కొన్ని నెలలుగా మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ న్యూస్ ఏదైన ఉంది అంటే అది సమంత-నాగచైతన్య ల విడాకుల మ్యాటర్ నే. వీళ్ళు పెళ్లికి ముందు సినిమాల్లో నటిస్తున్నప్పుడు కానీ, గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతున్నప్పుడు కానీ, ఫైనల్ గా పెళ్ళి చేసుకున్నప్పుడు కానీ రాని అని వార్తలు..వీళ్లు విడాకులు తీసుకుంటున్నారు అనగానే రోజుకో వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది. వీళ్లు విడాకులు ప్రకటించి దాదాపు నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా ఇంకా వీళ్లు కలుస్తారు అని అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ అది ఇంక జరగని పని అని వాళ్ళకు ఎప్పుడు అర్ధమౌతుందో ఏమో..?

కాగా, చై-సామ్ ల విడాకుల మ్యాటర్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. నిజానికి సమంత నాగచైతన్య మనకు విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించింది అక్టోబర్ లో..కానీ, ఆగస్టు లోనే వాళ్లు వేరుగా ఉండాలని డిసైడ్ అయిపోయారట. వాళ్ళ లాయర్లతో, లీగల్ ఆఫిసర్లతో మాట్లాడుకుని ఫైనల్ గా మనకి అక్టోబర్ లో చెప్పారట. ఇంతకి ఆగస్టు లో ఏం జరిగిందంటే.. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్ళిన సమంతను అక్కడే ఉన్న అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఓ పెద్ద ఆవిడ..సమంతకు కోపం వచ్చే విధంగా మాట్లాడిందట. ఆడది అన్నాక కూసింత సిగ్గు ఉండాలి అన్నట్లు ఘాటుగా మాట్లాడిందట. ఆమె నటించిన వెబ్ సిరీస్ లోని పాత్రను ఉద్దేశిస్తూ పరోక్షంగా తిట్టిందట. అయితే పక్కనే ఉన్న నాగచైతన్య కానీ నాగార్జున కానీ ఏం అనలేదట. అంత పెద్ద హీరోయిన్ ని ..పైగా మామ, భర్త పక్కనే ఉన్నా కూడా ఏం మాట్లాడకపోవడంతో.. అవమానంగా ఫీల్ అయ్యి బాధపడిన సమంత ఫంక్షన్ పూర్తికాకుండానే ఇంటికి వచ్చేసిందట.

ఇక అసలైన వార్ స్టార్ట్ అయ్యింది అప్పుడేనట. ఆ రోజు రాత్రి చై-సామ్ ల మధ్య పెద్ద గొడవే జరిగిందట. మాట మాట పెరిగి సమంత కోపంలో నాగార్జున మొదటి పెళ్లి విషయం తీసుకొచ్చిందట. అక్కడే ఉన్న నాగార్జున స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరిచారట. ఫుల్ ఫైర్ అయిపోయిన చైతన్య సమంత పైకి చెయ్యి కూడా ఎత్తాడట. భరించలేకపోయిన సమంత ఏడుస్తూ మెడలో నల్లపూసలు తెంపి చై మోహాన కొట్టి..బయటకు వచ్చేసిందట. నిజానికి నాగార్జున మొదట భార్యకి విడాకులు ఇవ్వడం తప్పే..కానీ సమంత అలా తన మామ గురించి మాట్లాడకూడదు ..తండ్రిని అలా అంటే ఏ కొడుకుకి అయినా బాధ వేస్తుంది కదా అంటున్నారు అభిమానులు. అలా పచ్చటి సంసారంలో ఆ పెద్ద ఆవిడ తెలియకుండానే నిప్పులుపోసిన్నట్లైంది.