ఫస్ట్ టైం నమ్రత బీహేవియర్ కు హర్ట్ అయిన మహేష్..మాటలు కట్..వామ్మో అంత గొడవ జరిగిందా ?

భార్య భర్తలు అన్నాక అలకలు,గొడవలు కామన్. సినిమాలో ఫైట్ సీన్స్ లేకపోతే ఎంత చప్పగా ఉంటాదో.. మొగుడుపెళ్లాల మధ్య గిల్లికజ్జాలు లేకపోతే..అంతే చప్పగా ఉంటాది లైఫ్. అలకలు,తిట్లు,గొడవలు, రొమాన్స్ , అన్ని ఉంటేనే సంసారం సాఫీగా సాగిపోతుంది. గొడవలు అంటే జుట్లు పట్టుకుని రోడు మీదకు వచ్చి కొట్టుకోవడం కాదండోయ్.. చిలిపి గొడవలు, సరదాగా తగాదాలు..వేసుకోవాలి.. మళ్ళీ ఇద్దరు కూల్ అయ్యి బుజ్జగించుకుని దగ్గరైపోవాలి. అలాంటి భార్య భర్తలను నేటి కాలంలో మనం చూడటం చాలా అరుదు. అది కూడా సెలబ్రిటీలల్లో ఆ విధమైన జంటలను చూడాలి అన్నా చాలా రేర్ గా కనిపిస్తారు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మీరు అలాంటి క్యూట్ రోమాంటిక్ కపుల్స్ ని చూడాలి అనుకుంటే మాత్రం నమ్రత-మహేష్ లను చూడచ్చు.

టాలీవుడ్ లోనే ది బెస్ట్ రొమాంటిక్ కపుల్ గానే కాదు.. ఎంతో మంది భార్యభర్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మహేష్-నమ్రతల జంట. ప్రాణంగా ప్రేమించుకున్న ఈ జంట..ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోయినా..ఒప్పించి పెళ్లి చేసుకుని..ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. ఇలాంటి జంటను చూసి కొందరు సంతోషిస్తుంటే మరి కొందరు మేము ఇంత హ్యాపీగా ఉండలేకపోతున్నామే అంటూ కుళ్లు కుంటున్నారు. అయితే చాలా మందికి అనిపించచ్చు ఇంత హ్యాపీగా ఉంటారు వీళ్ల మధ్య గొడవలు రావా అని. ఎందుకు రావు వస్తాయి.. కానీ వాటిని పెంచుకుంటూ పోరు. ఎక్కడిక్కకడ కట్ చేసుకుని సర్ధుకుపోతుంటే..ఏ భార్యభర్తలు అయినా హ్యాపీగానే ఉంటారు. అదే మహేష్ నమ్రతల అసలు వైవాహిక సీక్రేట్.

ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ మహేష్ కు ఇలాంటి ప్రశ్నే ఎదురైన సంధర్భంలో ఆయన మాట్లాడుతూ..” పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నాం చిన్న చిన్న గొడవలు వచ్చేవి మళ్ళీ కూల్ అయిపోయి ఇద్దరం సారీ చెప్పుకుని సెట్ అయిపోయేవాళ్లం. బట్..గౌతం పుట్టాక మా మధ్య ఓ విషయం లో ఫైట్ అయ్యింది. అప్పటి వరకు బాగానే ఉన్న నమ్రత లో సడెన్ గా మార్పులు వచ్చాయి. పిలిచిన పలకదు. దగ్గరకు వెళ్లితే దూరం వెళ్లిపోయేది. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. ఓ విధంగా చెప్పాలంటే మా మధ్య మాటలు కట్ అయిపోయాయి. ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడకుండా ఉండాలి అంటే చాలా కష్టం. ఇక ఆ తరువాత కొన్ని రోజులకి మళీ సెట్ అయిపోయాం. ఇప్పటి వరకు మళ్ళీ మా మధ్య అలాంటి ప్రస్తావనే రాలేదు ” అంటూ చెప్పుకొచ్చారట. భార్యభర్తలు ఎవ్వరైన సరే.. ప్రాబ్లం ఉంటే మనం మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వకుండా మనమే ఓపెన్ గా అన్ని మాట్లాడుకుంటే..అని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేది మహేష్ చెప్పకనే చెప్పేశాడు. మరీ చూడాలి ఎంత మళ్ళీ భార్య భర్తలు ఈ ఫార్ములాని ఫాలో అవుతారో..?


Leave a Reply

*