మతమా..దేశమా..? ఏది మనకు ముఖ్యం..?

దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ,మతం పేరుతో ప్రజలమధ్య విభజన తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మునీశ్వర్ నాధ్ భండారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.కొంత మంది హిజాబ్ కోసం,ఇకొంత మంది దేవాలయంలో ధోవతులు మాత్రమే ధరించేలా ఆదేశాలివ్వాలని కోరడం దిగ్బ్రాంతికరంగ ఉందన్నారు .”అసలు ఏంటి ఇదంతా ? ఇది దేశమా లేకపోతే మతం పేరుతో విడిపోయిందా ?’అని ఆవేదన చెందారు.’దేశం ముఖ్యమా ?..మతం ముఖ్యమా ?’ అని ప్రశ్నించారు.దేవాలయాలలో డ్రెస్ కోడ్ అమలు చేయకులని ,హిందూయేతరులు ఆలయంలోకి ప్రేవేశించకుండా నిషేధం విధించాలని మద్రాస్ హైకోర్టు రీట్ పిటిషన్లు దాఖలయ్యాయి.శ్రీరంగానికి చెందిన రంగరాజన్ నరసింహన్ ఈ పిటిషన్లు దాఖలు చేసారు.హిజాబ్ వివాదం దేశాన్ని కుదిపేస్తున్న సమయంలోనే ఈ పిటిషన్లు దాఖలుకావడంపై హైకోర్టు దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.రెండు రిట్పిటిషన్లు పై చీఫ్ జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ నేతృత్వం లోని ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.డ్రెస్ కోడ్ అమలు చేయాలనీ ఏ చట్టం చూపిందని పిటిషనరును ప్రశ్నించింది.సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని అడిగింది.మనది లౌకిక దేశం అన్న సంగతి మర్చిపోకూడదని పిటిషనరును హెచ్చరించింది.’చర్చలు కేవలం హక్కులకు పరిమితం కావొద్దు.బాధ్యతలు గురించి కూడా ప్రజలు మాట్లాడాలి ‘ అని సీజే జస్టిస్ మునీశ్వర్ నాథ్ పిటిషనర్ కు సూచించారు.

అన్ని చోట్లా కోడ్ కోరడమేంటి..?

ఏదైనా ఒక ఆలయంలో నిభందనలు ఉంటే దాని ప్రకారం అక్కడ నడుచుకోవచ్చని, కానీ..అన్ని చోట్లా డ్రెస్ కోడ్ అమలు చేయాలనీ పిటిషనర్ ను కోరడం సమంజసం కాదని జస్టిస్ భండారి అన్నారు.డ్రెస్ కోడ్ పై కచ్చితమైన వివరాలు లేనపుడు ఆలయాల్లో నోటీసు బోర్డులపై ఏమని రాయాలని ప్రశ్నించారు.ఆగమ శాస్త్రం లో ఉన్న సమాచారాన్ని అందించాలని పిటిషనర్ ను అడిగారు.దాని సమందించిన పాత్రని అందజేసేందుకు సమయం ఇవ్వాలని పిటిషనేరును కోరగా,అందుకు కోర్టు సమ్మతించింది.మరోవైపు ఒక్కో దేవాలయం ఒక్కో ఆచారాన్నిఅనుసరిస్తున్నదాని, ఇతర మతస్థులను ధ్వజ స్థంభం వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తమిళనాడు అడ్వకేట్ జనరల్ ఆర్ షణ్ముగసుందరం కోర్టుకు తెలిపారు.డ్రెస్ కోడ్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలనీ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు,తదుపరి విచారణకు ఈ నెల 20కి వాయిదా వేసింది.


Leave a Reply

*