కోలీవుడ్ హీరో విజ‌య్ భార్య ఎవ‌రో తెలుసా..!

సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామ‌న్‌. టాప్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలు.. ఇలా ఎవ‌రైనా కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం మామూలే. అయితే ఈ బంధాలు ఎక్కువ కాలం నిల‌బ‌డ‌లేక‌పోతున్నాయి. సినిమా సెల‌బ్రిటీల్లో త‌ర‌చూ ఇగో వ‌స్తూ ఉంటుంది. ఆ ఇగోల‌ను శాటిస్‌పై చేసుకోలేని వారు త్వ‌ర‌గా విడిపోతూ ఉంటారు. బంధానికి ఉన్న విలువ సెల‌బ్రిటీల‌కు పెద్ద‌గా తెలియ‌దు. అయితే కొంద‌రు జంట‌లు మాత్రం ఆ ఇగోల‌కు దూరంగా దాంప‌త్య జీవితానికి విలువ ఇచ్చి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు.

సౌత్ ఇండియాలో టాప్ హీరోల్లో ఒక‌రిగా ఉన్నాడు ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్‌కు సౌత్ ఇండియాలో అన్ని భాష‌ల్లోనూ ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్నారు. విజ‌య్ సినిమాల‌కు త‌మిళంలో మాత్ర‌మే కాదు.. తెలుగులోనూ, క‌న్న‌డంలోనూ మాంచి క్రేజ్ ఉంది. ఇక విజ‌య్ సినీ నేప‌థ్యం ఉన్న ఫ్యామిలీలోనే జ‌న్మించాడు. చిన్న‌త‌నం నుంచే సినిమాలు అంటే ఎంతో ఆస‌క్తితో ఉండే విజ‌య్ త‌న తండ్రి అయిన సినీ ద‌ర్శ‌క దిగ్గ‌జం చంద్ర‌శేఖ‌ర్ ద‌గ్గ‌రే సినీ ఓన‌మాలు నేర్చుకున్నారు.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజ‌య్ ఆ త‌ర్వాత చిన్న హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఈ రోజు స్టార్ హీరోగా ఉన్నాడు. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. కోలీవుడ్ సూప‌ర్‌స్టార్లు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌తో పోటీగా ఎదిగిన విజ‌య్ గ‌త ద‌శాబ్ద‌కాలంగా తిరుగులేని స్టార్ హీరోగా కొన‌సాగుతున్నాడు. విజ‌య్ వ్య‌క్తిగ‌తం విష‌యానికి వ‌స్తే ఆయ‌న త‌మిళ పారిశ్రామిక‌వేత్త కుమార్తె త‌న అభిమాని అయిన సంగీత‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

సంగీత‌ను ప్రేమించాక‌.. పెద్ద‌ల ఇష్టంతో వివాహం చేసుకున్నాడు. ఆ రోజుల్లో వీరి పెళ్లి కోలీవుడ్‌లో సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. ఎందుకంటే వీరి కుటుంబ నేప‌థ్యాలు మాత్ర‌మే కాదు.. వీరి మ‌తాలు కూడా వేరు. సంగీతతో పెళ్లి జ‌రిగాక విజ‌య్ త‌న కెరీర్‌లో మ‌రింత పైకి ఎదిగారు. సంగీత ప్రోత్సాహంతోనే విజ‌య్ ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఉంటారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు సంజయ్, కుమార్తె సాగా.

Share post:

Latest