‘ ఖిలాడీ ‘ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌… మాస్ మ‌హ‌రాజ్ బ్యాండ్ వేసేశాడు..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, డింపుల్ హయతి – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా ఖిలాడి. పెన్ స్టూడియోస్‌, ఏ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ర‌వితేజ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్‌గా రు. 60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జ‌రిగింది. ద‌ర్శ‌కుడు ర‌మేష్‌వ‌ర్మకు నిర్మాత‌లు కోటి రూపాయ‌ల ఖ‌రీదైన కాస్ట్‌లీ కారు కూడా గిఫ్ట్ ఇచ్చారు.

ఈ నెల 11న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఖిలాడీ తొలి రోజు రు 4.80 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే సినిమాకు మిక్స్ డ్ టాక్ రావ‌డం, వీక్ కంటెంట్.. దీనికి తోడు ఆ మ‌రుస‌టి రోజు వ‌చ్చిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ డీజే టిల్లు సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుని యూత్‌ను అటెన్ష‌న్ చేయ‌డంతో ఖిలాడీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తేలిపోయి.. రోజు రోజుకు మ‌రింత డ్రాప్ అయ్యింది. ఈ సినిమాకు వారం రోజుల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవ‌లం రు. 10 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది.

ఖిలాడీ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ :

నైజాం = 3.79 కోట్లు
సీడెడ్ = 1.67 కోట్లు
ఉత్తరాంధ్ర = 1.42 కోట్లు
ఈస్ట్ = 0.74 కోట్లు
వెస్ట్ = 0.61 కోట్లు
గుంటూరు = 1.03 కోట్లు
కృష్ణా = 0.54 కోట్లు
నెల్లూరు = 0.50 కోట్లు
————————————-
ఏపీ + తెలంగాణ = 10.33 కోట్లు
————————————-
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక = 0.81 కోట్లు
ఓవర్సీస్ = 0.47 కోట్లు
హిందీ కలెక్షన్స్ = 0.63 కోట్లు
——————————————-
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ = 12.24 కోట్లు
——————————————–

ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 23 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.12.24 కోట్లు మాత్రమే రాబట్టుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే మ‌రో రు. 11 కోట్లు రావాలి. అది జ‌రిగే ప‌ని క‌న‌ప‌డ‌డం లేదు. దీంతో ఖిలాడీ డిజాస్ట‌ర్ దిశ‌గా వెళుతోంది.